Mirai Trailer
Mirai Trailer : తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘మిరాయ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. రితికా నాయక్, మంచు మనోజ్, శ్రియ, జగపతి బాబు, జయరాం.. లాంటి చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు.(Mirai Trailer)
ఇప్పటికే మిరాయ్ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మిరాయ్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ చూస్తుంటే.. 9 గ్రంథాలను కొంతమంది కాపాడుతుంటే వాటిని అందుకోవాలని విలన్(మంచు మనోజ్) ట్రై చేస్తుంటాడు. అతన్ని ఆపడానికి, త్రేతాయుగంలోని మిరాయ్ అనే ఆయుధాన్ని హీరో(తేజ సజ్జా) ఎలా సాధిస్తాడు, విలన్ ని ఎలా ఆపుతాడు అనే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మైథలాజికల్ టచ్ కూడా ఉంది. మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12 రిలీజ్ కానుంది.
Also See : Allu Ayaan Arha : తాతయ్యతో కలిసి వినాయక చవితి పూజ చేస్తున్న అల్లు అయాన్, అర్హ.. ఫొటోలు వైరల్..