Mirchi Madhavi shocking comments on casting couch in Tollywood
Mirchi Madhavi: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ గురించి చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ కౌచ్ కి చాలా మంది అమ్మాయిలు ఇప్పటికే తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. దీంతో, ఇండస్ట్రీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈమధ్యే కొంతమంది ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ వల్ల తమకు ఎదురైనా చేదు అనుభావాల గురించి ఓపెన్ గా చెప్తున్నారు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ నటి మిర్చి మాధవి(Mirchi Madhavi) చేరారు. రీసెంట్ గా ఈ నటి ఒక ప్రముఖ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా కాస్టింగ్ కౌచ్ వల్ల తాను ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకుంది.
Allu Arjun: పుష్ప 2 మరువలేని ప్రయాణం.. గొప్ప గౌరవం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
ఈ విషయం గురించి ఆమె మెట్లాడుతూ..”చాలా సినిమాలు చేశాకే నటిగా నాకు మంచి ఫేమ్ వచ్చింది. అందులో సుకుమార్ గారితో చేసిన 100% లవ్ ఒకటి. ఈ సినిమా విడుదలై హిట్ అయ్యాక ఒక నిర్మాణ సంస్థ నుంచి నాకు కాల్ వచ్చింది. తమ నెక్స్ట్ సినిమాలో ప్రకాష్ రాజ్ కి భార్య పాత్రలో మీరు చేయాలనీ అడిగారు. కానీ, ఆ అవకాశం మీకు రావాలంటే మీరు ఐదుగురికి కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. అది విని నేను షాక్ అయ్యాను. కానీ, ఆలాంటి వాళ్ళతో గొడవలు పెట్టుకొని లాభంలేదు. అందుకే వాళ్లకు నేను సింపుల్ గా నో చెప్పేశాను”అంటూ చెప్పుకోచ్చింది మాధవి. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో ఇంత నీచమైన మనుషులు ఉన్నారా. ఇలాంటి వాళ్ళ మధ్య సినిమాలు చేస్తున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు చాలా ఇండస్ట్రీలలో చాలా మంది మనుషులు ఇలాగే ఉన్నారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువగా ఫోక్స్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కొత్తగా ఇండస్ట్రీకి వద్దామని అనుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇది ఒక సైన్ బోర్డు లాంటిది అంటూ చాలా మంది కామెంట్స్ చెప్తున్నారు. మనం వెళ్లే ఏ చోటైనా జాగ్రత్తగా ఉండటం తప్పదు అంటున్నారు.