Mirzapur : మీర్జాపూర్‌ సీజన్ 4 కూడా ఉందంట.. ఇంకెంత సాగదీస్తార్రా బాబు..

ఇటీవలే జులై 5 నుంచి మీర్జాపూర్‌ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తాజాగా సీజన్ 4 కూడా ఉందని తెలుస్తుంది.

Mirzapur Season 3 Streaming in Amazon Prime Ott Mirzapur Actress Reveals Season 4 also there

Mirzapur Web Series : సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ అడల్ట్, క్రైమ్ కంటెంట్ తో యూత్ ని టార్గెట్ చేసి సక్సెస్ అయింది. ఈ సిరీస్ లోని మున్నా భాయ్, గుడ్డు క్యారెక్టర్స్ బాగా పాపులర్ అయ్యాయి. కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన మీర్జాపూర్ నుంచి ఇప్పటికి మూడు సీజన్లు వచ్చాయి. ఈ మూడు సీజన్లు కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతున్నాయి.

ఇటీవలే జులై 5 నుంచి మీర్జాపూర్‌ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ సీజన్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. గత సీజన్లతో పోలిస్తే అంత ఆసక్తిగా లేదని, ఈ సీజన్ లో కథని బాగా సాగదీశారని, అడల్ట్ కంటెంట్ కూడా తక్కువైందని, ఇంతటితో సిరీస్ ఆపేస్తే మంచిదని ప్రేక్షకులు మీర్జాపూర్‌ సీజన్ 3 పై కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సీజన్ 4 కూడా ఉందని తెలుస్తుంది.

Also Read : Devara Update : ‘దేవర’లో రెండు పాటలేనా..? దేవర షూటింగ్ అప్డేట్.. ఇంకెంత బ్యాలెన్స్ ఉందంటే..?

మీర్జాపూర్‌ మొదటి సీజన్ నుంచి నటిస్తున్న నటి షెర్నావాజ్‌ జిజినా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీర్జాపూర్‌ సీజన్ 4 కూడా ఉండబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. చాలా మంది ఈ సీజన్ కోసం పనిచేస్తునారు. సీజన్ 4 మీరు ఊహించలేని విధంగా ఉంటుంది. ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్ ఎలా ఫాస్ట్ గా చేస్తున్నారో నాకు అర్ధం కావట్లేదు. సీజన్ 4ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను అని తెలిపింది. దీంతో మీర్జాపూర్‌ సీజన్ 4 కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే దీనిపై ప్రేక్షకులు మాత్రం ఇంకెంత సాగదీస్తార్రా బాబు ఈ సిరీస్ కి ముగింపు ఇచ్చేస్తే బెటర్ అని అంటున్నారు.