×
Ad

Miss Shetty Mr Polishetty : టైమ్స్ స్క్వేర్ దగ్గర నవీన్ సందడి.. అమెరికాలో ఇంకా తగ్గని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి జోరు..

అమెరికాలో ఇంకా తగ్గని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి జోరు. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఈ మూవీ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న ఈ మూవీ తాజాగా..

Miss Shetty Mr Polishetty collections Naveen Polishetty at Times Square

Miss Shetty Mr Polishetty : న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క శెట్టి (Anushka Shetty) కలిసి నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబ‌ర్ 7న ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. రిలీజ్ అయ్యి దాదాపు 20 రోజులు అవుతున్నా ఈ మూవీ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.

Sreeleela : విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల డ్రాప్ అయ్యిందా..?

ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ సినిమాకి వస్తున్న ఆదరణ అంతాఇంతా కాదు. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఈ మూవీ 1 మిలియన్ మార్క్ ని అందుకొని నవీన్ కి కొత్త రికార్డుని అందించింది. తాజాగా ఈ మూవీ నవీన్ కి మరో రికార్డుని అందించబోతుంది. అమెరికాలో ఈ సినిమా ప్రస్తుతం 2M మార్క్ అందుకోవడానికి చాలా దగ్గరిలో ఉంది. ఇక ఈ సినిమాకి అక్కడ వస్తున్న ఆదరణ చూసిన నవీన్ పోలిశెట్టి.. అక్కడ సందడి చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ హీరో ప్రముఖ టైమ్స్ స్క్వేర్ సెంటర్ లో కనిపించి అభిమానుల మధ్య సందడి చేశాడు.

Game Changer : గేమ్ చెంజర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు.. సెప్టెంబర్ షూట్ అందుకే క్యాన్సిల్ అయ్యింది..

ఆ సమయంలోనే టైమ్స్ స్క్వేర్ బోర్డు పై ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ 2M మార్క్ న్యూస్ కూడా వేశారు. ఇక అక్కడ అభిమానులతో సెల్ఫీలు దిగి వారితో కలిసి నవీన్ సందడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని మూవీ నిర్మాతలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ మూవీని హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయలేదు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో.. ప్రస్తుతం బాలీవుడ్ మేకర్స్ ఈ మూవీని రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ రీమేక్ రైట్స్ దక్కించుకోవడానికి రెండు బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.