Mithra Mandali first look out now
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా తదితరులు కీలక పాత్రల్లో ఓ మూవీలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిత్ర మండలి అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తెలియజేసింది.
Shine Tom Chacko : దసరా విలన్ చాకోకి భారీ యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం.. కానీ..
టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. ఈ చిత్రం ద్వారా తెలుగుతెరకి పరిచయం అవుతోంది. ఆమె ఇటీవల ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ కోసం టామ్ క్రూజ్‌తో కలిపి పని చేసింది.
బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై ‘మిత్ర మండలి’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.