Shine Tom Chacko : దసరా విలన్ చాకోకి భారీ యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం.. కానీ..
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Actor Shine Tom Chacko father died in road Accident
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి మరణించారు. నటుడు షైన్ టామ్ చాకోతో పాటు ఆయన తల్లి, సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో వెలుతున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నటుడు షైన్ టామ్ చాకో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నటుడితో పాటు, ఆయన తల్లి, సోదరుడు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
ముందు మనం చేయాల్సింది ఇది.. హీరోలు, ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లకు బన్నీ వాసు నైస్ క్లాస్..!
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. నాని హీరోగా నటించిన దసరా మూవీలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.