కేసీఆర్ జన్మదినం – ఘనంగా హరిత హారం..

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్..

  • Published By: sekhar ,Published On : February 17, 2020 / 07:49 AM IST
కేసీఆర్ జన్మదినం – ఘనంగా హరిత హారం..

Updated On : February 17, 2020 / 7:49 AM IST

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్..

ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పిలుపు మేరకు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆద్వర్యంలో బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని దర్శకుడు హరీష్ శంకర్ ఆఫీస్ పరిసరాల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ : ‘‘మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చేపట్టిన ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజలందరూ మొక్కలు నాటాలని కోరుతున్నాను. అలాగే నా బాల్యమిత్రుడు,ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అన్నారు.

ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ : ‘‘మన సీఎం కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతా ఈ రోజు అందరూ ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ గారి గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా నేను ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించి, తన బిజీ షెడ్యూల్‌లో కూడా సమయం కేటాయించిన నా మిత్రుడు, డైరెక్టర్ హరీష్ శంకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మన్నె కవితతో పాటు సీనియర్ జర్నలిస్టులు పి.వి శ్రీనివాస్, వై.జె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

MLA Kranti Kiran, & Director Harish Shankar take part in Haritha Haram on the occasion of Telangana Cm KCR's Birthday