MAA Election: ‘మా’ ఎన్నికలలో ఎమ్మెల్యే రోజా ఓటెవరికి?

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఇప్పుడు సినీ పరిశ్రమలో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.

MAA Election: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఇప్పుడు సినీ పరిశ్రమలో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబరు 10వ తేదీన జరగబోతున్న మా ఎన్నికలలో ప్రధానంగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఎవరికి వారు మీడియా మీట్లు, ఛానెళ్లలో ఇంటర్వ్యూలో ఎవరి వర్గంలో వాళ్ళు ఓట్ల వేటలో ఓటర్లకు ఫోన్లు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు గెలుపు వేటలో ఉన్నారు.

Aryan Khan: ఒకవైపు పాపం పిల్లాడనే సింపతీ.. మరోవైపు సెటైర్లు!

ఎవరికి వారు మీడియా సమావేశాలు.. ఇంటర్వ్యూలతో రచ్చ లేపుతున్నారు. మరోవైపు మిగతా నటీనటులు ఎవరికి వారు అనుకూల ప్యానెళ్ల వైపు మాట్లాడుతూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఎన్నికల క్యాంపెనింగ్ ఆసక్తిగా సాగుతుంది. ఇండస్ట్రీలో టాప్ ఫ్యామిలీగా చెప్పుకొనే వాళ్ళు కూడా ఈ ఎన్నికలలో పరోక్షంగా ఎవరొకరికి సపోర్ట్ ఇస్తున్నట్లుగా కనిపించే ఈ ఎన్నికలలో కోటా శ్రీనివాస్ లాంటి నటుల కామెంట్స్.. హేమా లాంటి నటీమణుల ఫిర్యాదులు ఇలా రోజుకో మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్నాయి.

Prabhas: రెబల్ స్టార్ సినిమాల లైనప్.. సాహో అనాల్సిందే!

కాగా, ఎమ్మెల్యే రోజా అంటే ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు. అంతకు ముందే ఆమె నటి కాగా ఇప్పుడు మా ఎన్నికలలో ఆమె ఓటు ఎవరికి వేస్తారన్నది కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే.. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. ఆచితూచి ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నారో చెప్పారు. ఒకవిధంగా తాను ఎవరికి ఓటు వేయాలనుకున్న విషయాన్ని బయటకు చెప్పేందుకు ఆమె ఇష్టపడటం లేదు.

Rashi Khanna: సెగలు రేపే సొగసుతో రాశీ ఖన్నా రచ్చ!

అసలు మా ఎన్నికలలో వేలు పెట్టాలని అనుకోవటం లేదన్న రోజా సభ్యురాలిగా తన ఓటుహక్కును మాత్రం వినియోగించుకుంటానని.. రెండు ప్యానళ్ల మేనిఫేస్టోల్ని పరిశీలించి ఎవరిది ఉపయోగంగా ఉంటుందో వారికే తన ఓటు అంటూ తెలివిగా తప్పించుకున్నారు. ఇక లోకల్.. నాన్ లోకల్ లాంటి వివాదాస్పద అంశాల మీద తాను రియాక్టు కానని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు