RK Sagar
RK Sagar : చక్రవాకం, మొగలిరేకులు సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న ఆర్కే సాగర్ ప్రస్తుతం హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. మొదట్లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక రోల్ చేసాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చినా పలు కారణాలతో ఛాన్సులు వదిలేసుకున్నాడు.
సాగర్ ఇప్పుడు ది 100 అనే సినిమాతో జులై 11న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు.
Also Read : టాప్ హీరోయిన్ అలియా భట్‌కే టోపీ పెట్టిన అసిస్టెంట్.. ఏకంగా..
తనకు వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాల గురించి సాగర్ మాట్లాడుతూ.. నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. కానీ అది మంచి పాత్ర, నాకు పేరు తెస్తుంది, నా ఇమేజ్ కి సూట్ అయితేనే చేయాలనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి OG సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది. కానీ అనుకోకుండా మిస్ కమ్యూనికేషన్ వల్ల ఆ ఛాన్స్ పోయింది. అప్పటికి నేను ఇంకా జనసేనలో చేరలేదు. ఆ సినిమాలో ఛాన్స్ పోయినా ఆయనతో కలిసి పార్టీ కోసం పనిచేసే అవకాశం వచ్చింది అని తెలిపారు. ఆర్కే సాగర్ మిస్ చేసుకున్నది తమిళ నటుడు అర్జున్ దాస్ చేసే పాత్ర అని సమాచారం.