Mohan Babu Comments on Manoj and Vishnu issue
Manoj Vs Vishnu : ఇటీవల మంచు కుటుంబానికి సంబంధించిన విబేధాలు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. మంచు వారసులు విష్ణు (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) మధ్య జరిగిన ఒక గొడవ వీడియో రూపంలో బయటకి రావడం. దానిని స్వయంగా మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చినీయాంశం అయ్యింది. ఆ తరువాత ఆ వీడియోని మోహన్ బాబు (Mohan Babu) డిలీట్ చేయించడం జరిగింది. ఇక తాజాగా మంచు విష్ణు.. ఆ గొడవ ఒక రియాలిటీ షో అంటూ అనౌన్స్ చేసి అందర్నీ అయోమయంలో పడేశాడు.
మంచు విష్ణు ఈ గొడవ ఒక రియాలిటీ షో అంటూ చెప్పుకొస్తూ.. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏమి జరుగుతుందో అర్ధంకాక నెటిజెన్లు తికమక పడుతున్నారు. కాగా ఈ గొడవ గురించి మంచు కుటుంబంలోని ఇతర సభ్యులు ఎవరు నోరు విప్పలేదు. తాజాగా దీని పై మోహన్ బాబు స్పందించాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్నదమ్ములు మధ్య మనస్పర్థలు వస్తాయి. అవి రావని మనం చెప్పలేం.
Manchu Manoj : అన్నతో గొడవ గురించి మీడియా ముందు మాట్లాడిన మనోజ్.. వాళ్ళని అడిగితే బాగా తెలుస్తుంది!
కానీ, అవి ఎందుకు వస్తాయి అంటే మనం జవాబు చెప్పలేము. ఉదాహరణకి మహాభారతం తీసుకోండి. అన్నదమ్ములు మధ్య ఉన్న చిన్నపాటి అపార్ధాలు.. చిలికి చిలికి గాలి వానగా మారాయి. నిజ జీవితంలో కూడా అంతే. ఆవేశాలకు పోయి మనుషులను దూరం చేసుకుంటున్నాము. దాని వల్ల ఆనందాలు కూడా దూరం అవుతాయి. ఆ తరువాత అలా జరగకుండా ఉంటె బాగుండు కదా? అలా ఎందుకు జరిగింది అని బాధ పడతాం. నేను అలా బాధపడ్డాను అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.