Mohan Babu Interesting Comments on Politics
Mohan Babu : గత 50 ఏళ్లుగా ఎన్నో వందల సినిమాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పించారు మోహన్ బాబు. గత కొంతకాలంగా మాత్రం అడపాదడపానే సినిమాలు చేస్తూ తన విద్యాసంస్థలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప సినిమాలో ఓ పాత్ర చేస్తున్నారు. త్వరలోనే కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది.
కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో అనేక అంశాలు మాట్లాడారు. మోహన్ బాబు గతంలో రాజ్యసభ ఎంపీగా పని చేసిన సంగతి తెలిసిందే. మొదట తెలుగుదేశం పార్టీలో, ఆ తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నారు మోహన్ బాబు. అయితే కొన్నాళ్ల క్రితం రాజకీయాలు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు.
Also Read : NTR : మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి..? వైరల్ అవుతున్న వీడియో..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నేను రాజసంగా రాజ్యసభకు వెళ్ళాను. కానీ నాలా ముక్కుసూటిగా ఉండేవాళ్ళకు, నిజాలు నిర్బయంగా మాట్లాడే వాళ్లకు రాజకీయాలు పనికిరావు. అందుకే నటుడిగానే ఉండిపోదాం అనుకున్నాను. రాజకీయాలు నాకు సూట్ అవ్వవు. రాజకీయాల్లో మోసం చేసిన వాళ్ళని చూసాను. ఇది రాజకీయమా అని వదిలేసాను అని అన్నారు.
దీంతో మోహన్ బాబు మళ్ళీ రాజకీయాల్లోకి రాను అని మరోసారి క్లారిటీ ఇచ్చారు.