NTR : మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి..? వైరల్ అవుతున్న వీడియో..
ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఓ బాటిల్ లో డ్రింక్ తాగుతూ కనిపించారు.

NTR Drinikng a Special Bottle Liquid in Mad Square Success Event
NTR : నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు ముఖ్య పాత్రల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నిన్న ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్, ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి, ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ ని మరింత సక్సెస్ చేసారు.
Also Read : Ashu Reddy : అమెరికా నుంచి పెట్ డాగ్ తేవాలంటే పెద్ద ప్రాసెస్.. గవర్నమెంట్ అప్రూవల్.. అప్పుడు చాలా ఏడ్చాను..
అయితే ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఓ బాటిల్ లో డ్రింక్ తాగుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి అని ఫ్యాన్స్, నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎన్టీఆర్ తాగింది పెరియర్ అనే కంపెనీకి చెందిన కార్బోనేటేడ్ మినరల్ వాటర్. ఇది జస్ట్ వాటర్ మాత్రమే. ఇది 330 ml బాటిల్స్ లో దొరుకుతుంది. దీని ధర 165 రూపాయలు. ఆన్లైన్ లో ఆఫర్స్ ని బట్టి ఒక్కో బాటిల్ 145 నుంచి, బల్క్ ఆర్డర్ లో తక్కువ రెట్లో దొరుకుతాయి. ఇది సోడా టేస్ట్ లో ఉంటుంది. మరి మీరు కూడా ఈ పెరియర్ కార్బోనేటేడ్ మినరల్ వాటర్ తగలనుకుంటే ఆన్లైన్ లో అమెజాన్, బిగ్ బాస్కెట్, స్విగ్గి.. లాంటి యాప్స్ లో ఆర్డర్ చేసుకొని తాగేయండి.
ఇది ఫ్రాన్స్ కి సంబంధించిన కంపెనీ. 1992 నుంచి ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం 140 దేశాల్లో ఈ వాటర్ ని అమ్ముతున్నారు.