Ashu Reddy : అమెరికా నుంచి పెట్ డాగ్ తేవాలంటే పెద్ద ప్రాసెస్.. గవర్నమెంట్ అప్రూవల్.. అప్పుడు చాలా ఏడ్చాను..
అషురెడ్డి తన పెట్ డాగ్ గురించి మాట్లాడుతూ..

Ashu Reddy Tells about her Pet Dog brought it From America
Ashu Reddy : వేరే దేశాల నుంచి మన దేశానికి పెట్ డాగ్స్, జంతువులను తీసుకురావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వాలి. పెట్ యానిమల్స్ కి కూడా పర్మిషన్స్ కావాల్సిందే. తాజాగా నటి, యాంకర్ అషురెడ్డి అమెరికా నుంచి వచ్చేటప్పుడు తన పెట్ డాగ్ ని తెచ్చుకున్నట్టు తెలిపింది. తన పెట్ డాగ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.
అషురెడ్డి తన పెట్ డాగ్ గురించి మాట్లాడుతూ.. రాజు నా పెట్ డాగ్. తనని అడాప్ట్ చేసుకోడానికి వెళ్ళినప్పుడు ఇంకో డాగ్ కూడా నచ్చింది. కానీ అమెరికాలో డాగ్స్ చాలా ఖరీదు. నాకు అప్పుడున్న బడ్జెట్ కి ఒక్కదాన్నే అడాప్ట్ చేసుకోగలిగాను. రాజుని అమెరికా నుంచి తెచ్చుకున్నాను. పెట్స్ తెచ్చుకోవాలంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనం అప్రూవల్ తెచ్చుకోవాలి. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ డాగ్ బ్రీడ్ హైదరాబాద్ క్లైమేట్ లో బతుకుతుంది అని చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ వచ్చాకే నేను ఇండియాకు తెచ్చుకున్నాను. కానీ ఇక్కడికి రాగానే నేను బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయాను. దాంతో రాజుని వదిలి వెళ్లిపోవాలని చాలా ఏడ్చాను కూడా. రాజుతో ఇప్పుడు చాలా అటాచ్ అయ్యాను అని తెలిపింది.