RRR : రాజమౌళి- రామ్ చరణ్ – ఎన్టీఆర్ స్పెషల్ ఈవెంట్.. ఫ్యాన్స్ కి పండగే.. ఎప్పుడంటే? టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి..?
RRR ప్రమోషన్స్ లో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి రెగ్యులర్ గా కలిసి కనపడి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు.

Ram Charan NTR and Rajamouli will Grace RRR Special Event
Ram Charan – NTR – Rajamouli : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి RRR సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ గుర్తింపు తెచ్చుకున్నారు. నాటు నాటు సాంగ్ తో ఏకంగా ఆస్కార్ అవార్డు ని కూడా సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సినిమాతో హాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ కూడా ఏర్పడింది. RRR ప్రమోషన్స్ లో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి రెగ్యులర్ గా కలిసి కనపడి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు.
ఇప్పుడు ఈ ముగ్గురు స్టార్స్ మరోసారి కలిసి కనపడబోతున్నారు. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో RRR సినిమాని ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా కీరవాణితో RRR సాంగ్స్ ఆర్కెస్ట్రా కూడా నిర్వహించనున్నారు. వచ్చేనెల మే 11న సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరగనుంది. సినిమా ప్రదర్శించేముందు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో – అక్కడి ఆడియన్స్ తో క్వశ్చన్ – ఆన్సర్స్ కార్యక్రమం కూడా నిర్వహిస్తారట.
ఇప్పటికే ఈ ప్రోగ్రాంకి రాయల్ ఆల్బర్ట్ హాల్ సైట్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇంగ్లాండ్, లండన్ లో ఉండే ఫ్యాన్స్ ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకొని డైరెక్ట్ గా ఆ షోకి వెళ్లొచ్చు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలను లైవ్ లో చూసి మాట్లాడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఈ ఈవెంట్ టికెట్స్ ని https://www.royalalberthall.com/tickets/events/2025/rrr-live ఈ లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
చాలా రోజుల తర్వాత మళ్ళీ రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి కనిపిస్తుండటం, రాజమౌళి కూడా వీరితో కలవడంతో ఈ ఈవెంట్ పై ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటున్నారు. మరోసారి భారీ మల్టీస్టారర్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.