Manchu Mohan Babu : ఇళయరాజాకు మోహన్ బాబు పరామర్శ.. కూతురు పోయిన విషాదం నుండి కోలుకోవాలని..

మంచు మోహన్ బాబు చెన్నై వెళ్లి ఇళయరాజాను కలిసారు. కూతురు పోయిన దుఃఖంలో ఉన్న ఆయనను ఓదార్చారు.

Mohan Babu M

Manchu Mohan Babu : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా కుమార్తె భవతారిణి ఈనెల 25న క్యాన్సర్‌తో కన్నుమూసారు. తీవ్ర విషాదంలో ఉన్న ఇళయరాజా కుటుంబాన్ని ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు చెన్నైలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. మోహన్ బాబు వెంటన ఆయన సతీమణి నిర్మల కూడా ఉన్నారు.

Bhavatharini: ఇళయరాజా కుమార్తె, సింగర్ భవతారిణి మృతి

ఇళయరాజా కుమార్తె భవతారణి సింగర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. రాసయ్య సినిమాతో గాయనిగా అరంగేట్రం చేసిన భవతారణి కధలుక్కు మరియాదై, భారతి, అళగి, ఫ్రెండ్స్, పా, మంకథ , అనేగన్ వంటి సినిమాల్లో పాటలు పాడారు. భారతి సినిమాలోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. కాగా భవతారిణి కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. శ్రీలంకలో చికిత్స తీసుకుంటున్న ఆమె పరిస్థితి విషమించి జనవరి 25న మరణించారు. ఈ నేపథ్యంలో తీవ్ర విషాదంలో ఉన్న ఇళయరాజా కుటుంబాన్ని మంచు మోహన్ బాబు పరామర్శించారు. స్వయంగా ఇళయరాజాను కలిసి ఓదార్చారు. ఈ విషయాన్ని మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

Mohan Babu : చిత్ర పరిశ్రమకు అన్నీ కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది.. మంచు మోహన్ బాబు వ్యాఖ్యలు

‘హృదయ విదారక వార్త విన్న వెంటనే నేను ఇళయరాజాను కలిసాను. కుమార్తె భవతారిణిని కోల్పోయిన విషాదంలో ఉన్న ఆయనకు, కుటుంబ సభ్యలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను’ అంటూ మోహన్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.