Bhavatharini: ఇళయరాజా కుమార్తె, సింగర్ భవతారిణి మృతి
భవతారిణి 'భారతి'లోని 'మయిల్ పోల పొన్ను ఒన్ను' అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు.

Bhavatharini
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె, గాయని భవతారిణి (47) క్యాన్సర్‌తో మృతి చెందారు. ఆమె కాలేయ క్యాన్సర్‌కు చికిత్స పొందేందుకు శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి విషమించి ఇవాళ సాయంత్రం 5 గంటలకు శ్రీలంకలోనే మరణించారు.
భవతారిణి భౌతికకాయాన్ని రేపు చెన్నైకి తీసుకువస్తారు. అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. భవతారిణి భర్తతో కలిసి ఉంటున్నారు. భవతారిణి ‘భారతి’లోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు.
ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు. భవతారిణి తన తండ్రి, సోదరుల డైరెక్షన్‌లోనే ఎక్కువగా పాటలు పాడారు. కొన్ని నెలలుగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు.
కాగా, భవతారిణి ‘రాసయ్య’ సినిమాతో గాయనిగా అరంగేట్రం చేశారు. ఆమె చివరిగా మలయాళ చిత్రం ‘మాయానది’లో పాడారు. తమిళ సినిమాలు ‘కధలుక్కు మరియాదై’, ‘భారతి’, ‘అళగి’, ‘ఫ్రెండ్స్’, ‘పా’, ‘మంకథ’, ‘అనేగన్’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలకు మంచి పేరు వచ్చింది.
INDIA alliance: మోదీని గెలిపించేది ‘ఇండియా’ కూటమే? ఏం జరుగుతుందో తెలుసా?