Mohan Lal Roshan Vrushabha Movie Opening Pooja Ceremony Happened
Vrushabha Movie : బాలీవుడ్ స్టార్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మాణంలో నంద కిషోర్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా ‘వృషభ’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో 2024లో ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో మోహన్ లాల్ కొడుకుగా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాతో రోషన్ కి కెరీర్ ఆరంభంలోనే పాన్ ఇండియా సినిమా, స్టార్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందని అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
ఈ వృషభ సినిమా తండ్రి కొడుకుల మధ్య కథతో తెరకెక్కనుంది కాబట్టి ఇందులో రోషన్ కి నటించడానికి మంచి స్కోప్ కూడా దొరుకుతుందని పలువురు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నట్టు సమాచారం. దీంతో తండ్రీకొడుకులు ఇద్దరూ మొదటి సారి ఓ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది.
Sarayu : బిగ్‌బాస్ మొత్తం ఫేక్.. అలాంటి షోలు చూడకండి.. మాజీ కంటెస్టెంట్ సరయు సంచలన వ్యాఖ్యలు..
ఇక పూజా కార్యక్రమాల్లో శ్రీకాంత్ భార్య ఊహ కూడా పాల్గొంది. దీంతో వృషభ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ పూజా కార్యక్రమాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాలో శాన్యా కపూర్, జరా ఖాన్ హీరోయిన్స్ గా నటించబోతున్నారు.
MOHANLAL’S PAN-INDIA FILM ‘VRUSHABHA’: SHOOT BEGINS… Filming of PAN-#India film #Vrushabha – starring #Mohanlal in the central role – commenced yesterday [22 July 2023].#Vrushabha also features #RoshannMeka, #ShanayaKapoor [daughter of #SanjayKapoor], #ZahrahSKhan [daughter… pic.twitter.com/dfgBl3Myds
— taran adarsh (@taran_adarsh) July 23, 2023