Mohanlal – Mammootty : 16 ఏళ్ళ తర్వాత కలిసి సినిమా చేయబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు.. శ్రీలంకలో షూటింగ్ మొదలు..

మోహన్ లాల్, మమ్ముట్టి గతంలో ఏడు సినిమాల్లో కలిసి నటించారు.

Mohanlal and Mammootty doing a Multi Starrer Movie after 16 Years

Mohanlal – Mammootty : ఏ సినీ పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేస్తే వాటిపై భారీ అంచనాలు ఉంటాయి. గతంలో రెగ్యులర్ గా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఆ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది. తాజాగా మలయాళం సినీ పరిశ్రమకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, మలయాళం స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు.

Also Read : Pawan Kalyan : ఇది కదా పవన్ అంటే.. తప్పుచేస్తే ఫ్యాన్స్ అయినా, జనసైనికులు అయినా చర్యలు తీసుకుంటామని పోస్ట్..

మోహన్ లాల్, మమ్ముట్టి గతంలో ఏడు సినిమాల్లో కలిసి నటించారు. చివరగా 2008లో ట్వంటీ అనే సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత ఈ స్టార్ హీరోలు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, నయనతార, కుంచకకోబన్, దర్శన రాజేంద్రన్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నేడు శ్రీలంకలో షూటింగ్ మొదలుపెట్టింది. ఏకంగా 150 రోజులు ఈ సినిమా షూటింగ్ చేస్తారట. నేడు సినిమా ఓపెనింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మలయాళం స్టార్ హీరోలు ఇద్దరూ కలిసి చేస్తుండటంతో ఈ సినిమాపై మళయాళంలోనే కాక వేరే పరిశ్రమల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు.