Jeevajothi Santhakumar: తెరమీదకి తమిళనాడు జీవజ్యోతి బయోపిక్!
జీవజ్యోతి శాంతకుమార్.. ఈ పేరు గుర్తుందా. కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పేరు.. దాన్ని వెనుక కథ ఇప్పుడు వెండితెర మీదకి రానుంది. తనను లైంగికంగా వేధించి, తన భర్తను చంపించిన.. దోశ కింగ్, శరవణ భవన్ రెస్టారెంట్ల అధినేత, బిజినెస్ మెన్ రాజగోపాల్ పై అలుపెరగని పోరాటం చేసి చివరికి..

Jeevajothi Santhakumar
Jeevajothi Santhakumar: జీవజ్యోతి శాంతకుమార్.. ఈ పేరు గుర్తుందా. కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పేరు.. దాన్ని వెనుక కథ ఇప్పుడు వెండితెర మీదకి రానుంది. తనను లైంగికంగా వేధించి, తన భర్తను చంపించిన.. దోశ కింగ్, శరవణ భవన్ రెస్టారెంట్ల అధినేత, బిజినెస్ మెన్ రాజగోపాల్ పై అలుపెరగని పోరాటం చేసి చివరికి తనను కటకటాలలోకి నెట్టేసిన ఈ ధీర వనిత గాధను ఇప్పుడు వెండితెర మీదకు తీసుకురానున్నారు.
శరవణ భవన్ హోటల్‌లో పనిచేసే కార్మికురాలైన జీవజ్యోతిని వశపరచుకోవడానికి హోటల్స్ అధినేత రాజగోపాల్ రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి ఆమె భర్తను కిరాతకంగా చంపించాడు. రాజగోపాల్‌పై కార్మికురాలైన జీవజ్యోతి 18 ఏళ్లు పెద్ద పోరాటమే చేసి చివరికి గెలుపు సాధించింది. జీవజ్యోతి భర్తను చంపిన కేసులో రాజగోపాల్ జైలులో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యం పాలై మరణించారు.
కాగా, ఇప్పుడు ఈ క్రైమ్ స్టోరీపై జంగిల్ పిక్చర్స్ చిత్ర నిర్మాణ సంస్థ సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది. జీవజ్యోతి బయోపిక్ గా తెరకెక్కే ఈ సినిమాలో జీవజ్యోతి, రాజగోపాల్ పాత్రల్లో నటించే నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నారు. కాగా.. తన జీవితంలో మరిచిపోలేని విషాదాన్ని.. న్యాయం కోసం తాను చేసిన పోరాటంపై సినిమా తెరకెక్కడంపై స్పందించిన జీవజ్యోతి సంతోషం వ్యక్తం చేశారు.
సమాజంలో అర్థబలం, అంగబలం కలిగిన ఒక హోటల్ అధినేతపై తన 18 ఏళ్ల పోరును జంగిల్ పిక్చర్స్ సంస్థ సినిమాగా రూపొందించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తన జీవిత గాథను తెరపై చూసిన తర్వాత పురుషాధిక్యం కారణంగా తాను అనుభవించిన బాధ అందరికీ తెలుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.