×
Ad

80’s Reunion: 80’స్ రీయూనియన్.. ఆడుతూపాడుతూ సందడిచేసిన తారలు.. ఫోటోలు వైరల్

సినీ స్టార్స్ గెట్ టు గెదర్ తో మరోసారి సందడి చేశారు. 1980వ దశకంలో సినిమాల్లో నటించిన(80's Reunion) నటీనటులు అంతా ప్రతీ సంవత్సరం 80'స్ రీయూనియన్ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసుకొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

movie stars enjoyed in 80s reunion party

80’s Reunion: సినీ స్టార్స్ గెట్ టు గెదర్ తో మరోసారి సందడి చేశారు. 1980వ దశకంలో సినిమాల్లో నటించిన నటీనటులు అంతా ప్రతీ సంవత్సరం 80’స్ రీయూనియన్ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసుకొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో(80’s Reunion), 2022లో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ ఇంట్లో ఈ వేడుక జరిగింది. మరోసారి ఈ 80’స్ రీయూనియన్ లో తారలు మెరిశారు. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Suhas: సుహాస్ సినిమా షూటింగులో ప్రమాదం.. బోల్తాకొట్టిన పడవ

ఇక ఈ రీ-యూనియన్ పార్టీకి చిరంజీవి, వెంకటేష్, భానుచందర్, నరేష్, శరత్ కుమార్, జాకీ ష్రాఫ్, ప్రభు, సురేష్ తదితరులు హాజరయ్యారు. ఇక హీరోయిన్స్ లో సుహాసిని, రేవతి, నదియా, జయసుధ, సుమలత, మీనా, రాధా, కుష్బూ, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. అలనాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, సరదా ఆటపాటలతో వీరంతా సందడి చేశారు. అయితే, ఈ ఇయర్ 80’స్ రీయూనియన్ కి వైల్డ్ టైగర్ థీమ్ తీసుకున్నారు. తరాలు అందరూ ఒకే రకమైన కాస్త్యుమ్స్ లో అలరించారు.