Movie Theaters : దేశవ్యాప్తంగా పదివేల సినిమా థియేటర్స్ కట్టనున్న గవర్నమెంట్..

 దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రూరల్ ఏరియాలలో ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ కట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ శాఖ మినిస్ట్రీ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఆధ్వర్యంలో............

Movie Theaters : దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రూరల్ ఏరియాలలో ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ కట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ శాఖ మినిస్ట్రీ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఆధ్వర్యంలో నడిచే CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్, అక్టోబర్ సినిమాస్ సంస్థతో కలిసి 2024 చివరికి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ శాఖ మినిస్ట్రీ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి, CSC ఇ-గవర్నెన్స్ ఈ మేరకు అక్టోబర్ సినిమాస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అతి తక్కువ ధరకే థియేటర్ ని కట్టించేలా ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ ఉన్న చిన్న సినిమా థియేటర్లను తెరవాలి. 2023 చివరికి 1500 థియేటర్స్, 2024 చివరికి 10000 థియేటర్స్ కట్టాలనుకుంటుంది. ఇందులో యువతని, వ్యాపారవేత్తలని, ఆసక్తి ఉన్నవాళ్ళని భాగం చేయనుంది.

Yogi Babu : స్టార్ కమెడియన్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు..

ఈ మేరకు అక్టోబర్ సినిమాస్ సంస్థ ఒక ఆఫర్ ని కూడా ప్రకటించింది. కేవలం 21000 చెల్లించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కేవలం 15 లక్షల్లో థియేటర్ కట్టిస్తామని, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించనుందని తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటనని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటికే 5000 మంది ఇందుకు ఆసక్తి చూపించి రిజిస్టర్ చేసుకున్నారని కూడా తెలిపింది. మీలో ఎవరికన్నా థియేటర్ కట్టాలి అని ఆసక్తి ఉంటే వాళ్ళు ఇచ్చిన వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.

ట్రెండింగ్ వార్తలు