సుశాంత్ మరణం : బాలీవుడ్ ‘ఖాన్’ త్రయంపై ధ్వజమెత్తిన Mp సుబ్రహ్మణ్యస్వామి

  • Publish Date - July 11, 2020 / 02:53 PM IST

తనదైన శైలిలో మాట్లాడుతు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బాలీవుడ్ ‘ఖాన్’త్రయంపై ఫైర్ అయ్యారు. కొన్నిరోజులక్రితం బాలివుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనతరం తర్వాత బాలీవుడ్ ‘ఖాన్’ త్రయం అయిన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లపై ద్వజమెత్తారు. ఈ ‘ఖాన్’ త్రయం మౌనం దాల్చిందా? అంటూ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

“ఈ ముగ్గురు జగజ్జెంత్రీలు భారత్ తో పాటు విదేశాల్లో కూడా తాము వెనుకేసుకున్న ఆస్తులపై విచారణ జరపాలి అన్నారు. ముఖ్యంగా..ఈ ఖాన్ ల త్రయానికి దుబాయ్ లో ఉన్న ఆస్తులపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అక్కడ వారికి బంగ్లాలు, స్థిరాస్తులు ఎవరు గిఫ్టుగా ఇచ్చారో..ఆ ఆస్తులను వారు కొన్నారో తేలాలి. దీనివెనుక ఉన్న వ్యవస్థ ఏమిటో సిట్, ఈడీ, ఐటీ, సీబీఐ విచారణ జరిపి నిగ్గు తేల్చాలి. ఈ ఖాన్ ల త్రాయాలేమన్నా చట్టానికి అతీతులా?” అంటూ నిలదీశారు సుబ్రహ్మణ్యస్వామి.