మిస్టర్ మజ్ను రివ్యూ

అఖిల్‌తో పాటు.. అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆశలు పెట్టుకున్న మిస్టర్ మజ్ను ఫస్టాఫ్ వరకూ ఆకట్టుకున్నా.. సెకండాఫ్‌లో రొటీన్‌గా అనిపించింది.

  • Published By: sekhar ,Published On : January 25, 2019 / 08:54 AM IST
మిస్టర్ మజ్ను రివ్యూ

అఖిల్‌తో పాటు.. అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆశలు పెట్టుకున్న మిస్టర్ మజ్ను ఫస్టాఫ్ వరకూ ఆకట్టుకున్నా.. సెకండాఫ్‌లో రొటీన్‌గా అనిపించింది.

అక్కినేని అఖిల్, తన మొదటి 2 సినిమాలు భారీ బడ్జెట్‌తో, పేరున్న డైరెక్టర్స్‌తో, ప్రెస్టీజియస్ బ్యానర్స్‌లో చేసినా.. మినిమమ్ రేంజ్ హిట్ కూడా దక్కలేదు. దాంతో రియలైజ్ అయిన అఖిల్ సినిమాల కౌంట్ కంటే.. హిట్ కంటెంట్ ఉన్న సినిమాలు చెయ్యడమే బెటర్ అని, కాస్త గ్యాప్ తీసుకుని వెంకీ అట్లూరితో తన మూడో సినిమా మొదలుపెట్టాడు. తన తొలి ప్రయత్నంలోనే తొలిప్రేమతో మ్యాజికల్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి.. అఖిల్‌ని ప్లేబాయ్‌గా మార్చి, అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన మజ్ను టైటిల్ కలిసేలా మిస్టర్ మజ్ను‌ని తెరకెక్కించాడు. ఈ సినిమా లైన్ ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉండడంతో థమన్ మ్యూజికల్ మ్యాజిక్ మరోసారి వర్కవుట్ అవ్వడం, ప్రోమోస్ సైతం కూల్ ఎంటర్‌టైనర్ అనేలా హింట్స్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. డల్ సీజన్‌లో థియేటర్స్‌లోకి వచ్చిన సినిమా తన మ్యాజిక్‌ని ఎంతవరకూ వర్కవుట్ చేసింది..? ప్రేక్షకులను అలరించిందా, లేదా..? అఖిల్‌కి మొదటి హిట్ దక్కిందా, లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికొస్తే.. విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ.. కేర్ ఫ్రీ యాటిట్యూడ్‌తో పెరిగిన అబ్బాయి. ఫ్లర్టింగ్‌లో ఎక్స్‌‌పర్ట్. అలాంటి విక్కీని, నిఖిత అలియాస్ నిక్కీ మొదట ద్వేషిస్తుంది. కానీ, అతని ఇన్నర్ పర్సనాలిటీ, పాజిటివ్ క్వాలిటీస్ నచ్చి ప్రేమిస్తుంది. ఇదే విషయాన్ని విక్కీకి చెప్తుంది. దాంతో వాళ్లిద్దరూ ఒకరికొకరు కరెక్టా .. కాదా..? అనే కన్‌‌క్లూజన్‌కి రావడానికి లవ్ జర్నీని స్టార్ట్ చేస్తారు. ఆ జర్నీలో నిక్కీ .. విక్కీని ఎక్కువగా ప్రేమిస్తే.. విక్కీ మాత్రం ఆబ్లిగేషన్‌లా ఫీలవుతాడు. దాంతో హర్ట్ అయిన నిక్కీ.. యు.కె వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి, నిక్కీ ప్రేమను పొందాలని.. విక్కీ కూడా యు.కె.కి వెళ్తాడు. విక్కీ… నిక్కీని కన్విన్స్ చేసే ప్రాసెస్‌లో అతను ఎలాంటి కష్టాలు పడతాడు..? తన ప్రేమను నిక్కీకి ఎలా కన్వే చేశాడు..? చివరకి నిక్కీ.. విక్కీ ప్రేమను అంగీకరించిందా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల విషయానికొస్తే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, సినిమా .. సినిమాకీ.. తనను తాను మెరుగు పరుచుకుంటూ, యాక్టింగ్ స్కిల్స్‌‌ని మెరుగు పరుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తన గత 2 సినిమాలతో పోలిస్తే.. అఖిల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా మారాయి. అతని స్టైలింగ్ కూడా చాలా బావుంది. నటనలో ఈజ్ కనిపించింది. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎప్పటి లానే.. అఖిల్ ఎనర్జీ లెవల్స్ మెప్పించాయి. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చాలా మెచ్యూరిటీ చూపించాడు. ఇక సవ్యసాచిలో పేరుకే హీరోయిన్‌గా మిగిలిపోయిన నిధిఅగర్వాల్‌కి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. కెరీర్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న నిధి చాలా ఎఫర్ట్ పెట్టినా.. నిక్కీ పాత్రకు పూర్తిగా న్యాయం చెయ్యలేకపోయింది.కానీ, ఆమెలో మంచి హీరోయిన్‌కి కావల్సిన క్వాలిటీస్ అన్నీ పుష్కలంగా ఉన్నాయని క్లారిటీ ఈ సినిమాతో లభించింది. నాగబాబు, రావురమేష్, సుబ్బరాజు, సితార, పవిత్ర లోకేష్ , జయప్రకాష్, అజయ్, సత్యకృష్ణన్, వీళ్లంతా.. సఫిస్టికేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్‌లా బాగా సెట్ అయ్యారు. ఇక హైపర్ ఆది, ప్రియదర్శి, విద్యుల్లేఖ అక్కడక్కడా కాస్త నవ్వులు పూయించారు. మిగతా నటీనటులందరూ డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుపోయారు.

టెక్నీషియన్స్ విషయనికొస్తే.. తొలిప్రేమ సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి రెండో సినిమాతో కూడా రొటీన్ లైన్‌నే ఎంచుకున్నాడు. కాకపోతే.. మొదటి సినిమాలో క్రియేట్ చేసిన మ్యాజిక్ ఈ సినిమాలో రిపీట్ చెయ్యడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ వరకూ తన మార్క్ ఎమోషన్స్, లవబుల్ సీన్స్‌తో ఆకట్టుకున్న వెంకీ సెకండాఫ్‌కి వచ్చే వరకూ బాగా రొటీన్ దారి పట్టాడు. చాలాచోట్ల క్లూలెస్‌గా కనిపించాడు. కామెడీ కూడా మొదటి సినిమాతో కంపేర్ చేస్తే చాలా వరకూ తగ్గింది. క్లైమాక్స్ సీన్స్‌లో వెంకీ డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి. ఇక కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో ఉన్న థమన్.. ఈ సినిమాకి మనసు పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలతోనే మెప్పించి మిస్టర్ మజ్ను‌పై పాజిటివ్ వైబ్స్ కల్పించిన థమన్, ఆర్.ఆర్ విషయంలో కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. ప్రతి సీన్‌లోనూ ఉన్న కంటెంట్ ఇంపాక్ట్‌ని రెట్టింపు చేశాడు. థమన్ సంగీతమే  ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. జార్జ్.సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమాకి స్టైలిష్ అండ్ లావిష్ లుక్ తీసుకురావడంలో జార్జ్ భాగస్వామ్యం చాలా ఉంది. ఇక వెంకీ టాలెంట్‌ని నమ్మి, సినిమాకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చుపెట్టారు నిర్మాత. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

ఓవరాల్‌గా చెప్పాలంటే.. అఖిల్‌తో పాటు.. అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆశలు పెట్టుకున్న మిస్టర్ మజ్ను ఫస్టాఫ్ వరకూ ఆకట్టుకున్నా, సెకండాఫ్‌లో రొటీన్‌గా అనిపించింది. కాకపోతే.. యూత్ అప్పీల్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే కొన్ని క్వాలిటీస్, ఎమోషన్స్ కూడా ఉండడంతో A సెంటర్స్‌లో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. B,C సెంటర్స్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర ఈసినిమా కనెక్ట్ అయిపోతుంది. ..

ప్లస్
అఖిల్ క్యారెక్టర్, స్టైలింగ్
మ్యూజిక్, డైలాగ్స్
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
……..
మైనస్
రొటీన్ కథ
సెకండాఫ్ స్క్రీన్ ప్లే
తగ్గిన కామెడీ
ఫీల్ లేని లవ్ సీన్స్