టీజర్ అంతా ఇంతే…

మిస్టర్ అండ్ మిస్ టీజర్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : February 9, 2019 / 08:03 AM IST
టీజర్ అంతా ఇంతే…

Updated On : February 9, 2019 / 8:03 AM IST

మిస్టర్ అండ్ మిస్ టీజర్ రిలీజ్.

అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల ప్రేరణతో, అడల్ట్ కంటెంట్‌తో కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. యూత్‌కి నచ్చే బూతు కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్, విచ్చలవిడి అందాల ఆరబోత, లిప్‌లాక్‌లు.. కంటెంట్ ఉన్నా, లేకపోయినా.. ఇవి ఉంటే చాలనుకుంటున్నారు మేకర్స్.. ఏడు చేపలకథ, చీకటి గదిలో చితక్కొట్టుడు, 4 లెటర్స్ వంటి సినిమాల టీజర్స్.. సోషల్ మీడియాలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసాయో తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో మిస్టర్ అండ్ మిస్ అనే సినిమా రాబోతుంది. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఎటువంటి డైలాగ్స్ లేకుండా, బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో, హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ని హైలెట్ చేస్తూ ఈ టీజర్ కట్ చేసారు. గాఢమైన లిప్‌లాక్‌తో పాటు బెడ్‌రూమ్ షాట్స్ కూడా చూపిస్తూ, రీ కలెక్ట్ యువర్ మెమరీస్ టు అవాయిడ్ బ్రేకప్స్.. అనే మంచి కొటేషన్ ఇస్తూ, టీజర్ ఎండ్ చేసారు.

జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్నీ జంటగా కనిపించనున్నారు. మిస్టర్ అండ్ మిస్.. క్రౌడ్ ఫండింగ్ సినిమాగా రూపొందుతుంది. అశోక్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ, లిరిక్స్ : పవన్ రాచేపల్లి, మ్యూజిక్ : యశ్వంత్ నాగ్, సినిమాటోగ్రఫీ : సిద్ధం మంధార్, ఎడిటింగ్ : కార్తీక్ కట్స్, ఆర్ట్ : కరిష్ కుమార్, కథ, డైరెక్షన్ : అశోక్ రెడ్డి, బ్యానర్ : రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్.

వాచ్ టీజర్…