Mrunal Thakur : జిమ్‌ ట్రైనర్‌ని మోసం చేస్తున్న మృణాల్ ఠాకూర్.. క్యూట్ వర్క్ అవుట్ వీడియో చూశారా..

జిమ్‌ ట్రైనర్‌ని మోసం చేస్తున్న మృణాల్ ఠాకూర్. వర్క్ అవుట్స్ చేస్తున్నట్లు నటిస్తున్న మృణాల్ ఫన్నీ చీటింగ్ వీడియోని చూశారా..

Mrunal Thakur : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసారు. కానీ అభిమానులను మాత్రం అక్కడి కంటే ఇక్కడే ఎక్కువగా సంపాదించుకున్నారు. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ తెలుగు ఆడియన్స్ ని పలకరించిన మృణాల్.. మరో తెలుగు సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, నెట్టింట మృణాల్ కి సంబంధించిన జిమ్ వీడియో వైరల్ గా మారింది.

తన అందచెందాలతో ఆకట్టుకునే మృణాల్ ఠాకూర్.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ బాడీ ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తుంటారు. అయితే ఈ వర్క్ అవుట్స్ చేయడానికి మృణాల్ జిమ్ లో ఇష్టం లేకుండా కష్ట పడుతున్నారు. జిమ్ ట్రైనర్ మృణాల్ ని దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. అయితే జిమ్ ట్రైనర్ చూడని సమయంలో వర్క్ అవుట్స్ ఆపేసి రిలాక్స్ అవుతున్న మృణాల్.. ట్రైనర్ రాగానే వర్క్ అవుట్స్ చేస్తున్నట్లు ఫుల్ కవరింగ్ ఇస్తున్నారు.

Also read : Pushpa 2 : నార్త్‌లో పుష్ప గాడి రూల్ మాములుగా లేదుగా.. కల్కి, దేవరని మించి ప్రీ రిలీజ్ బిజినెస్..!

ఇలా తన జిమ్ ట్రైనర్ ని మోసం చేస్తున్న వీడియోని మృణాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ వీడియో చూడడానికి చాలా క్యూటర్ గా ఉండడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. మృణాల్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫన్నీ చీటింగ్ వీడియోని మీరు కూడా చూసి నవ్వుకోండి.

కాగా మృణాల్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని మే 3 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమ్ చేయనున్నారట. మరి థియేటర్స్ లో పెద్ద సత్తా చాటలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు