Mrunal Thakur : తెలుగు అబ్బాయితో మృణాల్ పెళ్లి.. మృణాల్ ఇన్‌స్టా వీడియో వైరల్..

తెలుగు అబ్బాయితో మృణాల్ పెళ్లి. ఈ మాట చెప్పి మిమ్మల్ని బాధపెడుతునందుకు సారీ అంటూ మృణాల్ పోస్టు.

Mrunal Thakur comments about her marriage news

Mrunal Thakur : టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్.. సీతారామంతో తెలుగులో సూపర్ ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటిస్తుంది. ఇది ఇలా ఉంటే, కొన్నిరోజులు నుంచి ఈ భామ పెళ్లి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు రావడానికి కారణం.. ఇటీవల సైమా అవార్డు ఈవెంట్ లో అల్లు అరవింద్, మృణాల్ ఠాకూర్ తో చేసిన కామెంట్స్.

ఇంతకీ ఆయన కామెంట్స్ ఏంటంటే.. “గతంలో ఒక వేదిక పై ఒక హీరోయిన్ తో ఒక మాట అన్నాను. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని టాలీవుడ్ కి కోడలుగా వచ్చేమని. ఆ మాటని ఆ యాక్ట్రెస్ నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా.. టాలీవుడ్ కోడలుగా హైదరాబాద్ వచ్చేయ్” అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు మృణాల్ సిగ్గుపడుతూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

Also read : Samantha : అల్లు అర్జున్‌తో కలిసి సూపర్ హీరో సినిమా చేయాలని ఉంది..

దీంతో సోషల్ మీడియాలో మృణాల్ పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి. ఈ వార్తలు కాస్త మృణాల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు వెళ్లడంతో.. ఆమెకు ఫోన్ చేసి పెళ్లి గురించి అడుగుతున్నారట. దీంతో మృణాల్ ఒక వీడియో చేసి తన ఇన్‌స్టా స్టోరీ పెట్టింది. “ఈ పెళ్లి వార్తలు తనకి చాలా నవ్వు తెప్పించాయని, తను ఎవర్ని పెళ్లి చేసుకోవడం లేదని, ఈ మాట చెప్పి మిమ్మల్ని బాధపెడుతునందుకు సారీ” అంటూ మృణాల్ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మృణాల్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో నానితో కలిసి మృణాల్ సందడి చేస్తుంది. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ సంక్రాంతి కానుకగా తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు.