Samantha : అల్లు అర్జున్‌తో కలిసి సూపర్ హీరో సినిమా చేయాలని ఉంది..
అల్లు అర్జున్‌తో కలిసి సూపర్ హీరో సినిమా చేయాలని ఉంది అంటుంది హీరోయిన్ సమంత.

Samantha comments about Allu Arjun at The Marvels event
Samantha : మయోసైటిస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన హీరోయిన్ సమంత.. తిరిగి వచ్చిన దగ్గర నుంచి యాడ్ షూట్స్, పలు ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక హాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది. హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘ది మార్వెల్స్’ రిలీజ్ కి సిద్దమవుతుంది. ‘కెప్టెన్ మార్వెల్’ సినిమాకి ఇది కొనసాగింపుగా వస్తుంది. 2019లో వచ్చిన మొదటి సినిమా తెలుగు కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ ని సమంత దగ్గర ఉండి నడిపించింది.
ఇప్పుడు ఈ చిత్రం కోసం కూడా మరోసారి సమంత మార్వెల్ హీరోలకు సహాయం అందిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సమంతని కొన్ని విషయాలు అడగగా ఆమె బదులిచ్చింది. ఈక్రమంలోనే సమంతని.. ‘మీరు అవెంజర్ అయితే ఎవరితో కలిసి ప్రపంచాన్ని కాపాడుతారు?’ అని ప్రశ్నించారు. దానికి సామ్ వెంటనే బదులిస్తూ.. ‘నా అభిమానులతో కలిసి ప్రపంచాన్ని కాపాడుతాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Also read : Bharateeyudu 2 : ‘భారతీయుడుని’ మళ్ళీ తీసుకు వచ్చిన రాజమౌళి.. ఇండియన్ 2 టీజర్ చూశారా..!
ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరితో ప్రపంచాన్ని కాపాడుతారు? అని ప్రశ్నించగా, సమంత బదులిస్తూ.. “అల్లు అర్జున్, విజయ్, ప్రియాంక చోప్రా, అలియా భట్‌తో కలిసి ప్రపంచాన్ని కాపాడుతాను. ఇక నా జీవితానికి సంబంధించిన సూపర్ హీరోలు అంటే.. ముగ్గురు ఉన్నారు. మా అమ్మ, నా స్నేహితులు, నేను ఎదుర్కొనే సమస్యలు కూడా నాకు సూపర్ హీరోలే” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Samantha about Thalapathy Vijay ? Leo box-office hunt continues ? #Leo #ThalapathyViiay #Samantha #LeoSuccessMeet #LokeshKanagaraj #SamanthaRuthPrabhu #Anirudh pic.twitter.com/w42tAGapxh
— ??????? (@Deepak32763716) November 3, 2023
కాగా ది మార్వెల్స్ మూవీ ముగ్గురు సూపర్ హీరోలతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. నవంబర్ 10న ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో మార్వెల్ ఫ్యాన్స్ అంతా రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.