Bharateeyudu 2 : ‘భారతీయుడుని’ మళ్ళీ తీసుకు వచ్చిన రాజమౌళి.. ఇండియన్ 2 టీజర్ చూశారా..!

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'ఇండియన్ 2'.. ఇంట్రో తెలుగులో రాజమౌళి చేతులు మీదుగా జరిగింది. మరి ఆ ఇంట్రో వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Bharateeyudu 2 : ‘భారతీయుడుని’ మళ్ళీ తీసుకు వచ్చిన రాజమౌళి.. ఇండియన్ 2 టీజర్ చూశారా..!

Shankar Kamal Haasan Indian 2 movie teaser released by Rajamouli

Updated On : November 3, 2023 / 5:44 PM IST

Indian 2 : శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక శంకర్ ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలుపెట్టడానికి సిద్దమయ్యాడు. ఈక్రమంలోనే ఇండియన్ ఇంట్రో అంటూ ఒక చిన్న టీజర్ ని ఆడియన్స్ కోసం సిద్ధం చేశాడు. ఇక ఈ ఇంట్రో తెలుగులో రాజమౌళి చేతులు మీదుగా జరిగింది. మరి ఆ ఇంట్రో వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

భారతీయుడు మొదటి భాగం చివరిలో కమల్ హాసన్ ఇండియా వదిలి విదేశాలకు వెళ్లిపోయినట్లు చూపించారు. అలాగే ఇండియాలో మళ్ళీ అన్యాయం జరిగితే తాను తప్పకుండా వస్తానని, తనకి మరణం అనేది లేదని చూపించారు. ఆ సీన్ తోనే ఇంట్రో స్టార్ట్ చేశారు. అలా వెళ్లిపోయిన భారతీయుడిని మళ్ళీ రమ్మంటు దేశంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు సోషల్ మీడియా లో రిక్వెస్ట్ లు పెడుతుండడం, వారి బాధని తెలుసుకున్న భారతీయుడు మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం.. ఇంట్రో చూపించారు. మరి ఆ ఇంట్రో వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Kingdom of the Planet of the Apes : ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ కొత్త సినిమా ట్రైలర్ చూశారా..?

టీజర్ లో శంకర్ స్టాండర్డ్ విజువల్స్ కనిపించాయి. ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి.. ఈ టీజర్ లో క్లారిటీ ఇస్తారేమో అనుకున్నారు. కానీ విడుదల తేదీ గురించే టీజర్ లో మాట్లాడలేదు. కాగా ఈ సినిమాలో హీరో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.