Kalki 2898 AD : కల్కిలో ‘రాధ’గా మృణాల్ గెస్ట్ రోల్.. నెట్టింట రోజుకో వార్త వైరల్..

కల్కికి సంబంధించి నెట్టింట రోజుకో వార్త వైరల్ అవుతుంది. తాజాగా మృణాల్ గెస్ట్ రోల్ కి సంబంధించిన న్యూస్ ట్రెండ్ అవుతుంది.

Mrunal Thakur play a guest role in prabhas Kalki 2898 AD movie

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2898AD’. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్నప్పటికీ హిందూ మైథలాజి బ్యాక్ డ్రాప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో ప్రభాస్.. మహా విష్ణు దశావతారంలోని కల్కి పాత్రని పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మన ఇతిహాసాల్లో చెప్పబడిన ఏడుగురు చిరంజీవులు పాత్రలను కూడా చూపించబోతున్నారట.

ఇక ఈ సప్త చిరంజీవులుగా రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్, నాని, కమల్ హాసన్ కనిపించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక ప్రత్యేక పాత్రతో కనిపించబోతున్నారట.

Also read : Kurchi Madathapetti Song : కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌తో.. ఫారినర్స్ జిమ్ వర్క్ అవుట్స్..

మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ‘రాధ’ పాత్రతో కనిపించబోతున్నారట. ఈ పాత్ర కృష్ణుడి ప్రేయసి అయిన రాధ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. కాగా ఈ మూవీలో ఆల్రెడీ బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలతో పాటు నెట్టింట వైరల్ అవుతున్న మరో న్యూస్ ఏంటంటే.. ఈ మూవీ స్టోరీ శ్రీపద్మనాభస్వామి గుడిలోని ఆరో తలుపు రహస్యంతో లింక్ చేసి ఉండబోతుందట.

ఈ వార్త అయితే ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మూవీ టీం నుంచి క్లారిటీ రావాలి, లేదా సినిమా రిలీజ్ వరకు ఎదురు చూడాలి. కాగా ఈ మూవీని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. రెండు కంటే ఎక్కువ భాగాలుగా రూపొందుతుందట. ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం.