Urfi Javed : పొద్దున్నే రోడ్డు మీద ఉర్ఫి జావేద్ ని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు..

బిగ్‌బాస్(Bigg Boss) తో బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న భామ ఉర్ఫీ జావేద్ ఆ తర్వాత తన విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది. తాజాగా మరోసారి ఉర్ఫి జావేద్ వార్తల్లో నిలిచింది.

Mumbai Police Arrested Bollywood Actress Urfi Javed today Morning

Urfi Javed : హిందీ బిగ్‌బాస్(Bigg Boss) తో బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న భామ ఉర్ఫీ జావేద్ ఆ తర్వాత తన విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది. కాదేది వస్త్రధారణకు అనర్హం అంటూ చిత్రచిత్రాల డ్రెస్సులు, రకరకాల వస్తువులతో డ్రెస్సులు, బ్లేడ్లు, కవర్లు, గోనె సంచులు, సిమ్ కార్డులు, తాళ్లు… ఇలా రకరకాల వస్తువులతో డ్రెస్సులు వేస్తూ బాగా ఫేమస్ అయింది. అయితే కేవలం ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కప్పుకుంటూ మిగతా శరీరం అంతా కనపడేలా చాలా బోల్డ్ గా బట్టలు వేసుకొని, అలాగే రోడ్ల మీదకి, జనాల్లోకి రావడంతో వైరల్ అవ్వడంతో పాటు వివాదాల్లో కూడా నిలిచింది ఉర్ఫీ.

ఉర్ఫి జావేద్ విచిత్ర బోల్డ్ వేషధారణతో పలువురికి ఇబ్బంది కలుగుతున్నా, ఆమెని హెచ్చరించినా, ఆమెపై పోలీసు కేసులు పెట్టినా తాను మాత్రం మారట్లేదు. రోజురోజుకి తన డ్రెస్సింగ్ తో పాటు, తన సోషల్ మీడియా పోస్టులతో వివాదాల్లో, వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఉర్ఫి జావేద్ వార్తల్లో నిలిచింది.

Also Read : Salaar Movie : సలార్ పార్ట్ 2 రిలీజ్ అప్పుడేనా? పార్ట్ 1 ఇంకా రాలేదు పార్ట్ 2 గురించి చర్చ..

ఎప్పటిలాగే ఓ కొత్త రకం డ్రెస్ వేసుకొని పొద్దున్నే కాఫీ తాగడానికి బయటకి వచ్చింది ఉర్ఫి. బాటమ్ జీన్స్, టాప్ బ్యాక్ మొత్తం కనపడేలా కేవలం ఫ్రంట్ కవర్ అయ్యేలా ఓ లవ్ షేప్ క్లాత్ కట్టుకొని వచ్చింది. అయితే ఏమైందో తెలీదు కానీ కొంతమంది ముంబై మహిళా పోలీసులు(Mumbai Police) కాఫీ షాప్ వద్దకు వచ్చి రోడ్డు మీదే ఉర్ఫి జావేద్ ని అదుపులోకి తీసుకొని తమ పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. మొదట తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలని కాసేపు హడావిడి చేసింది ఉర్ఫి. ఆ తర్వాత పోలీసులతో వెళ్లి వారి వాహనంలో కూర్చుంది. అయితే ఉర్ఫిని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.