Murali Mohan : ఘనంగా మురళీ మోహన్ స్వర్ణోత్సవ వేడుక.. ఫిలిం అండ్ టెలివిజన్ కౌన్సిల్ ఆద్వర్యంలో..

మురళీ మోహన్ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు ఘనంగా సత్కరించాయి.

Murali Mohan 50 Years Film Industry Felicitation Event in Hyderabad

Murali Mohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పించిన నటుడు మురళీ మోహన్. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. మరోవైపు వ్యాపారవేత్తగా, రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. మురళీ మోహన్ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు అవుతుండటంతో తాజాగా ఆయన్ని సన్మానిస్తూ స్వర్ణోత్సవ వేడుక నిర్వహించారు.

మురళీ మోహన్ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు ఘనంగా సత్కరించాయి. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దని బోస్, అనీషా ముఖర్జీ, రోజా భారతి, సౌమ్య జాను.. పలువురు నటీనటులు, సినీ ప్రముఖుల మధ్య పండితుల వేదమంత్రాలతో మురళీ మోహన్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.

Also Read : Yamuna : 52 ఏళ్ళ వయసులో కూడా ఇంత అందంగా, హెల్తీగా.. నటి యమున సీక్రెట్స్ ఏంటి?

సన్మానం అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ.. అట్లూరి పూర్ణచంధ్రరావు గారి చేతుల మీదుగా 33వ ఏట కళామతల్లి ఆశీస్సులు పొందిన నేను నటునిగా, వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణించాను. ఈ క్రమంలో నాకు తోడుగా నిలిచిన వారందరికీ కృజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, తనకి సన్మానం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.