Yamuna : 52 ఏళ్ళ వయసులో కూడా ఇంత అందంగా, హెల్తీగా.. నటి యమున సీక్రెట్స్ ఏంటి?

ఆల్మోస్ట్ 50 ఏళ్ళు దాటినా సినిమాల్లో నటించేటప్పుడు ఎలా ఉందో ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది యమున.

Yamuna : 52 ఏళ్ళ వయసులో కూడా ఇంత అందంగా, హెల్తీగా.. నటి యమున సీక్రెట్స్ ఏంటి?

Actress Yamuna Health and Beauty Secrets at the age of 52

Yamuna : నటి యమున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు సినిమాల్లో హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమల్లో దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించింది. సినిమాల్లో నటిస్తూనే టెలివిజన్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. విధి, అన్వేషిత, రక్త సంబంధం.. లాంటి ఎన్నో హిట్ సీరియల్స్ తో ప్రేక్షకులకు దగ్గరైంది నటి యమున. ప్రస్తుతం కూడా మౌన పోరాటం తో పాటు పలు సీరియల్స్, టీవీ షోలతో అలరిస్తుంది.

అయితే ఆల్మోస్ట్ 50 ఏళ్ళు దాటినా సినిమాల్లో నటించేటప్పుడు ఎలా ఉందో ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది యమున. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యమున ఇన్నేళ్లయినా ఇంకా అలాగే ఉండటానికి కారణం చెప్పింది. ఫుడ్ తో పాటలు లైఫ్ స్టైల్ కూడా ముఖ్యం అని తెలిపింది.

Also Read : Lokesh Kanagaraj : శ్రుతి హాసన్ కోసం నటుడిగా మారుతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

నటి యమున మాట్లాడుతూ.. నా వయసు ఇప్పుడు 52. ఇంకా అలాగే ఉన్నాను అంటే నా లైఫ్ స్టైల్ ముఖ్య కారణం. ఫుడ్ ఒక కారణం అయినా దాని కంటే కూడా లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం. పొద్దున్నే తొందరగా లేచి 2 గ్లాసెస్ వాటర్ తాగుతాను. ఆ తర్వాత ఒక అరగంట ఎక్సర్ సైజ్, గంట సేపు మెడిటేషన్ చేస్తాను. స్నానం తర్వాత 10 గంటలకు డైరెక్ట్ లంచ్ చేసేస్తాను. షూట్ లో ఉంటే అక్కడికి వెళ్లి తింటాను. మధ్యాహ్నం ఫ్రూట్స్, నట్స్, జ్యూస్.. ఇలాంటివి తీసుకుంటాను. సాయంత్రం 7 లోపే డిన్నర్ ముగిస్తాను. అయితే మనం హెల్తీగా ఉండటానికి మనసు కూడా బాగుండాలి. మనసు ఎంత బాగుంటే హెల్త్ అంత బాగుంటుంది. అందుకే మెడిటేషన్ ఎక్కువ చేస్తాను. షూటింగ్ లో కూడా టైం ఉంటే మెడిటేషన్ చేస్తాను. తినేటప్పుడు షూటింగ్స్ లో కుదరదు కానీ ఇంట్లో మాత్రం కిందే కూర్చొని తింటాను. అలా కూర్చోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది. పడుకునేటప్పుడు ఫోన్ కచ్చితంగా అవాయిడ్ చేయాలి. పొద్దున్నే తొందరగా పనులు చేయడం వల్ల కూడా ఆ రోజంతా లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇదే పాటిస్తున్నాను అని తెలిపింది. యమున రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన సీరియల్ షూటింగ్ టైంలో గ్యాప్ దొరికితే వేరే నటీనటులతో రీల్స్ చేసి సరదాగా షేర్ చేస్తుంటుంది.