Lokesh Kanagaraj : శ్రుతి హాసన్ కోసం నటుడిగా మారుతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

తమిళ్ లో వరుస హిట్స్ కొడుతూ స్టార్ డైరెక్టర్ అయ్యాడు లోకేష్ కానగరాజ్. తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో రాబోయే సినిమాలపై కూడా ఆసక్తిని పెంచాడు. అయితే ఇప్పుడు లోకేష్ నటుడిగా కూడా మారబోతున్నాడు.

Lokesh Kanagaraj : శ్రుతి హాసన్ కోసం నటుడిగా మారుతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

Lokesh Kanagaraj Acting under Shruti Haasan Music Direction

Updated On : March 19, 2024 / 11:37 AM IST

Lokesh Kanagaraj : తమిళ్ లో వరుస హిట్స్ కొడుతూ స్టార్ డైరెక్టర్ అయ్యాడు లోకేష్ కానగరాజ్. తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో రాబోయే సినిమాలపై కూడా ఆసక్తిని పెంచాడు. అయితే ఇప్పుడు లోకేష్ నటుడిగా కూడా మారబోతున్నాడు. ఇటీవల లోకేష్, శ్రుతి హాసన్(Shruti Haasan) ఫోటో ఒకటి కమల్ హాసన్(Kamal Haasan) నిర్మాణ సంస్థ నుంచి రిలీజ్ చేయడంతో వీరి కాంబోలో సినిమా అనుకున్నారు అంతా. కానీ తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు.

శ్రుతి హాసన్ సింగర్, సంగీత దర్శకురాలు అని కూడా అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ని శ్రుతి హాసన్ రిలీజ్ చేసింది. తాజాగా తన నాన్న కమల్ హాసన్ నిర్మాణ సంస్థ RKFI ప్రొడక్షన్స్ లో కమల్ హాసన్ ఓ పాటని రాయగా శ్రుతి హాసన్ సంగీత దర్శకత్వంలో దాన్ని స్వరపర్చగా లోకేష్ కనగరాజ్ నటుడిగా షూట్ చేయబోతున్నారు. ‘ఇనిమెల్’ అనే పేరుతో ఈ ప్రైవేట్ ఆల్బమ్ ని చిత్రీకరిస్తున్నారు లోకేష్, శ్రుతి హాసన్.

Also Read : RC 16 Movie : ‘గేమ్ ఛేంజర్’ షూట్ కంప్లీట్..? గ్రాండ్‌గా RC16 ప్రారంభం.. రేపే పూజా కార్యక్రమాలు?

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇన్నాళ్లు దర్శకుడిగా మెప్పించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా ఎలా చేస్తాడో అని ఎదురుచూస్తున్నారు. అలాగే శ్రుతి హాసన్ అభిమానులు కూడా ఈ కొత్త ఇనిమెల్ పాట కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇనిమెల్ సాంగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.