RC 16 Movie : ‘గేమ్ ఛేంజర్’ షూట్ కంప్లీట్..? గ్రాండ్గా RC16 ప్రారంభం.. రేపే పూజా కార్యక్రమాలు?
ఇప్పటికే RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. చాలామంది ఉత్తరాంధ్ర వాళ్ళని కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ కూడా తీసుకున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం RC16 సినిమా పూజా కార్యక్రమం..
RC 16 Movie : రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్'(Game Changer) సినిమా షూట్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.. నిర్మాణంలో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని భారీగా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఏమి ప్రకటించకపోయినా ‘పెద్ది’ అనే టైటిల్ పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. చాలామంది ఉత్తరాంధ్ర వాళ్ళని కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ కూడా తీసుకున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం RC16 సినిమా పూజా కార్యక్రమం రేపు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఘనంగా జరగబోతుందని సమాచారం. మూవీ యూనిట్ అంతా దీనికి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్ సినిమా షూట్ వైజాగ్ లో జరుగుతుంది. నిన్నటితో వైజాగ్ షెడ్యూల్ పూర్తయిన్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ హైదరాబాద్ కి ఆల్రెడీ రిట్టర్న్ అయ్యారని, రేపు RC16 పూజా కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.
Also Read : Market Mahalakshmi : ఆ పేరు ఉన్న 200 మందికి సినిమా టికెట్స్ ఫ్రీ.. మీ పేరు కూడా అదేనా?
అయితే పూజా కార్యక్రమాలు అయినా గేమ్ ఛేంజర్ షూట్ మొత్తం పూర్తయ్యాకే RC16 షూట్ మొదలుపెడతారని బుచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అభిమానులు చరణ్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.