Market Mahalakshmi : ఆ పేరు ఉన్న 200 మందికి సినిమా టికెట్స్ ఫ్రీ.. మీ పేరు కూడా అదేనా?
పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’.

Market Mahalakshmi Movie Unit Offer to who have Mahalakshmi Name
Market Mahalakshmi : ఇటీవల సినిమా వాళ్ళు కొత్తకొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తమ సినిమాలు జనాల్లోకి వెళ్ళడానికి ఓ రేంజ్ లో కష్టపడుతున్నారు. ఫ్రీ టికెట్స్, గిఫ్ట్స్ అంటూ కూడా సరికొత్త ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఓ మూవీ యూనిట్ ఏకంగా 200 మందికి ఫ్రీ టికెట్స్ ఇస్తామంటుంది.
పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. ఈ సినిమాలో హీరోయిన్ మార్కెట్ మహాలక్ష్మి అనే మాస్ క్యారెక్టర్ పోషిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ రిలీజయి వైరల్ అయ్యాయి. ఓ సాఫ్ట్ వేర్ కుర్రోడు మార్కెట్ లో కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Also Read : Pooja Hegde : హమ్మయ్య.. పూజాహెగ్డేకి సినిమా ఛాన్సులు వస్తున్నాయి.. బాలీవుడ్‌లో బిజీ కాబోతున్న బుట్టబొమ్మ..
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ యూనిట్ సరికొత్తగా ఓ ఆఫర్ ఇచ్చింది ప్రేక్షకులకు. హీరో, హీరోయిన్స్ కలిసి ఈ ఆఫర్ ని ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో.. మీలో ఎవరికైనా మహాలక్ష్మి అనే పేరు ఉంటే ఐడీ ప్రూఫ్‌ను 9005500559కి వాట్సాప్ చేయండి. అందులో టాప్ 200 మంది మహాలక్ష్మి అనే పేరు ఉన్నవాళ్ళకి ఫ్రీగా టికెట్స్ ఇస్తాము అని తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం మీ పేరు కూడా మహాలక్ష్మి అయితే ఆ నంబర్ కి మీ ఐడి ప్రూఫ్ పంపించి ఫ్రీగా సినిమా టికెట్ పొందండి. ఇక ఈ మార్కెట్ మహాలక్ష్మి సినిమా మార్చ్ 29న రిలీజ్ కానుంది.