Ajay Arasada : బోలో గణపతి S/O ఉమాపతి.. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ వినాయక చవితి పాట..
మీరు కూడా ఈ ‘బోలో గణపతి S/O ఉమాపతి’ సాంగ్ చూసేయండి.. (Ajay Arasada)
Ajay Arasada
Ajay Arasada : ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి.. లాంటి వరుస సినిమాలు, సిరీస్ లతో హిట్స్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తాజాగా వినాయక చవితి సందర్భంగా ‘బోలో గణపతి S/O ఉమాపతి’ అనే ప్రైవేట్ సాంగ్ చేసారు. ఈ పాటకు అజయ్ అరసాడ సంగీతం అందించడంతో పాటు తన మ్యూజిక్ లేబుల్ AjA రికార్డ్స్ పై స్వయంగా నిర్మించారు. ఈ ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పాటను అజయ్ అరసాడ కేవలం రెండు రోజుల్లోనే కంపోజ్ చేశారు. భాస్కర్ తిరుమల ఈ పాటను రాయగా జయరామ్ పైలా, సింధూర రాజేష్ పాడారు.
ఈ ప్రైవేట్ సాంగ్ లో వర్కింగ్ విజువల్స్ తో పాటు లిరిక్స్ తగ్గట్టు ఉండే గణేష్ మహారాజ్ పెయింటింగ్ ఫ్రేమ్స్ చూపించారు. ఈ పాట క్లాస్ గా ఉంటూనే ట్రెండీ బీట్స్ తో సాగింది. దీంతో ఈ వినాయకచవితికి పందిళ్ళలో మొగడానికి మరో వినాయక సాంగ్ రెడీ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ఆ వినాయక సాంగ్ తోనే నిర్మాతగా మారి AjA రికార్డ్స్ మొదలుపెట్టారు. దీనిపై భవిష్యత్తులో మరిన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ రానున్నాయి అని తెలిపారు.

విశాఖపట్నానికి చెందిన అజయ్ అరసాడ చిన్నప్పట్నుంచి సంగీతంలో ప్రవేశం ఉంది. టీసీఎస్‌లో ఏడు సంవత్సరాలు పనిచేసి అనంతరం సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. ఓ రెండు సినిమాలకు ప్రోగ్రామింగ్ చేసి అనంతరం సొంతంగా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ అజయ్ ని వ్యక్తిగతంగా పిలిచి అభినందించడంతో పాటు భవిష్యత్తులో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కి కలిసి పనిచేద్దామని తెలిపారు.
మీరు కూడా ఈ ‘బోలో గణపతి S/O ఉమాపతి’ సాంగ్ చూసేయండి..
