×
Ad

Bheems Ceciroleo : టాలీవుడ్‌కి కొత్త కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికేశాడు.. ఇక దేవిశ్రీ, థమన్..

దేవిశ్రీ, థమన్ కాకుండా కమర్షియల్ సినిమాలకు మరో ఆప్షన్ గా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దొరికేశాడు. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ..

  • Published On : April 10, 2024 / 09:23 AM IST

Music director Bheems Ceciroleo getting offers from star hero movies

Bheems Ceciroleo : టాలీవుడ్ లో ప్రస్తుతం కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఎక్కువైంది. దేవిశ్రీ ప్రసాద్, థమన్ తరువాత ఇండస్ట్రీలో మరో కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్ మేకర్స్ తమిళ్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ వెనుక పడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆ అవసరం కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది. దేవిశ్రీ, థమన్ కాకుండా మరో ఆప్షన్ గా ‘భీమస్ సెసిరోలె’ కనిపిస్తున్నారు.

తెలంగాణకి చెందిన ఈ సంగీత దర్శకుడు.. అల్లరి నరేష్, శర్వానంద్ ‘నువ్వా నేనా’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. ఆ తరువాత జోరు, బెంగాల్ టైగర్, ధమాకా, బలగం, మ్యాడ్ వంటి సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఆకట్టుకున్నారు. ఇక రీసెంట్ గా ‘టిల్లు స్క్వేర్’కి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి అదుర్స్ అనిపించారు. దీంతో ఈ సంగీత దర్శకుడు టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడ్డారు.

Also read : War 2 : వార్ 2లో ఎన్టీఆర్‌కి తండ్రిగా జగపతి బాబు చేస్తున్నారా.. నిజమేనా..!

ఇంకేముంది వరుసపెట్టి ఆఫర్లు భీమస్ సెసిరోలె చెంతకి చేరుతున్నాయి. ఇప్పటికే ఈ సంగీత దర్శకుడు.. సాయి దుర్గ తేజ్ ‘గాంజా శంకర్’, అడివి శేష్ ‘డకాయిట్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైజన్ నాయుడు’, అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరి స్టార్ హీరో సినిమాలకు కూడా భీమస్ సెసిరోలె సైన్ చేసారు. రవితేజ, వెంకటేష్ కొత్త సినిమాలకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించబోతున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో తెరకెక్కబోతున్న రవితేజ 75వ సినిమాకి భీమస్ సెసిరోలె సంగీతం అందించబోతున్నారు. కాగా ఆల్రెడీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ధమాకా చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి రవితేజ సక్సెస్ లో ఒకసారి భాగమయ్యారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోయే సినిమాకి కూడా భీమస్ సెసిరోలె మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక అయ్యారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఆఫర్స్ ని అందుకుంటారో చూడాలి.