War 2 : వార్ 2లో ఎన్టీఆర్‌కి తండ్రిగా జగపతి బాబు చేస్తున్నారా.. నిజమేనా..!
వార్ 2లో ఎన్టీఆర్‌కి తండ్రిగా జగపతి బాబు చేస్తున్నారా..? ఈ ప్రశ్నకు జగ్గూభాయ్ ఏం చెప్పారు..?

Jagapathi Babu is really playing father role for NTR in Hrithik Roshan War 2
War 2 : బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తుంటే జాన్ అబ్రహం విలన్ గా కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీ జగపతి బాబు కూడా నటించబోతున్నారని బాలీవుడ్ వార్తలు వినిపించాయి.
ఎన్టీఆర్ పాత్రకి తండ్రిగా జగపతి బాబు కనిపించబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ రూమర్స్ గురించి జగపతి బాబుని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “ఈ రూమర్ ని నేను కూడా విన్నాను. కానీ నాకు వార్ 2 నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. ప్రస్తుతం అయితే ఇది రూమర్ మాత్రమే, నిజం కాదు” అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు.
Also read : Love Me : AIతో పాట పాడించిన ఆస్కార్ విన్నర్ కీరవాణి..
#Salaar2 is Going to be Magical ? ??#Salaar #SalaarUnBreakableRecords#Prabhas?pic.twitter.com/tnxnEN2IDk
— iamsrk (@iamsrk17__) April 9, 2024
ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. హృతిక్ రోషన్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఎన్టీఆర్ ఈ మూవీ సెట్స్ లోకి ఈ నెలాఖరులో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మొత్తం 60 రోజుల కాల్ షీట్స్ ని ఇచ్చారట. వీటిలో 30 రోజులు తన సోలో సీన్స్ కోసం, మరో 30 రోజులు హృతిక్‌తో కలిసి ఉన్న సీన్స్ కోసం కేటాయించారట. 2025 ఆగష్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
కాగా ఈ మూవీతో ఎన్టీఆర్ ని రా ఏజెంట్ గా పరిచయం చేయబోతున్న మేకర్స్.. ఆ తరువాత ఎన్టీఆర్ పాత్రతోనే స్పై యూనివర్స్ లో ఒక సోలో మూవీని తీసుకు రాబోతున్నారట. ప్రస్తుతం SRF స్పై యూనివర్స్ లో ‘టైగర్’గా సల్మాన్ ఖాన్, ‘పఠాన్’గా షారుఖ్ ఖాన్, ‘మేజర్ కబీర్’గా హృతిక్ రోషన్ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ స్పై యూనివర్స్ లో మన టాలీవుడ్ స్టార్ కూడా హీరో కాబోతున్నారు.