×
Ad

Music Director Dasi : ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..

ప్రముఖ సంగీత దర్శకుడు 'దాసి' కారు ప్రమాదంలో మృతి చెందారు. ఇండస్టర్లో ఎంతోమందికి కొత్తవారికి లైఫ్ ఇచ్చిన..

  • Published On : September 4, 2023 / 03:09 PM IST

Music Director Dasi is passed away due to an road accident

Music Director Dasi Died: సౌత్ లోని పలు లాంగ్వేజ్స్ అనేక భాషల్లో సంగీత దర్శకుడిగా అలరించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ‘దాసి’ కారు ప్రమాదంలో మృతి చెందారు. కేరళ (Kerala) నుంచి చెన్నై (Chennai) తిరిగి వస్తున్న సమయంలో.. తిరుపూర్ జిల్లా ప్రాంతంలో బైపాస్ పై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మ్యూజిక్ డైరెక్టర్ దాసితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ నలుగురిలో ఇద్దరు అక్కడికి అక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Rashmika Mandana : ర‌ష్మిక కాళ్లు మొక్కిన అసిస్టెంట్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

కొంతకాలంగా దాసి తన స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే దాసి అతని స్నేహితులు మూవేంద్రన్, తమిళ్ ఆదియన్ మరియు నాగరాజ్ కలిసి కేరళలోని ఓ స్థలం గురించి చర్చెందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు మంచి స్పీడ్ లో ఉన్న సమయంలో.. ముందు భాగంలోని కారు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి రెప్పపాటులో పక్కనే ఉన్న అడ్డుగోడను ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

Kushi Collections : మూడు రోజుల్లో 70 కోట్లు.. దూసుకుపోతున్న ఖుషి.. విజయ్ సినిమాకు 100 కోట్లు గ్యారెంటీ..

ఇక ముందు భాగంలో కూర్చొని ఉన్న దాసి, తమిళ్ ఆదియన్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు తిరుమురుగన్ బుండిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా మ్యూజిక్ డైరెక్టర్ గా దాసి.. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా, బెంగాలీ, ఇంగ్లీషు తదితర భాషల్లో స్వరకల్పన చేశారు. ఇక ఈయన కెరీర్ లో ఎంతోమంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దాదాపు 90 మంది కొత్త గాయకులు, 160 మంది పాటల రచయితలు.. దాసి వల్లే ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. ఇక ఈయన మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.