Top Music Directors 2024 : 2024లో రికార్డులు బద్దలు కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్లు

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి ఆల్బమ్ తో సినిమాకి కావల్సినంత బజ్ క్రియేట్ చేసేది మ్యూజిక్.

2024 Top Music Directors

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి ఆల్బమ్ తో సినిమాకి కావల్సినంత బజ్ క్రియేట్ చేసేది మ్యూజిక్. అలాంటి మ్యూజిక్ తో ఈసంవత్సరం ఆడియన్స్ నుంచి సక్సెస్ ఫుల్ అన్న పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవ‌రో చూద్దాం..

ఈ సంవత్సరం మోత మోగించి ఆడియన్స్ ని మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్లలో టాప్ అన్ డౌటెడ్ లీ తమనే. కుర్చీని మడతపెట్టి కొట్టిన కొట్టుడుకి సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఈ సంవత్సరం సంక్రాంతి కొచ్చిన గుంటూరుకారం నుంచి నెక్ట్స్ ఇయర్ రాబోయే గేమ్ చేంజర్ , డాకూ మహరాజ్ సినిమాలకు సంబంధించి రిలీజ్ అయిన పాటల వరకూ తమన్‌ పాటలే మోత మోగిపోతున్నాయి. ఆ రేంజ్ లో రికార్డ్ వ్యూస్ లో సక్సెస్ ఫుల్ గా క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు తమన్.

Unstoppable With NBK : బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌లో డాకు మ‌హారాజ్ ద‌ర్శ‌కుడు..

మిగతా డైరెక్టర్లు చేసిన సినిమాలు ఒకఎత్తు. పుష్ప2 ఒకెత్తు. ఆ రేంజ్ లో థియేటర్లో బద్దలయ్యే మ్యూజిక్ తో క్యారెక్టర్లకి, సినిమాలకు ఎలివేషన్ ఇచ్చారు దేవిశ్రీప్రసాద్. ఈ సంవత్సరంలో దేవిశ్రీ ప్రసాద్ చేసిన కంగువ, పుష్ప 2 సినిమాలకు సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నారు దేవిశ్రీ. స్పెషల్లీ పుష్ప 2 సాంగ్స్ ఇంకా సోషల్ మీడియాలో రికార్డులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. వీటికి తోడు నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అవుతున్న తండేల్ నుంచి రిలీజ్ అయిన బుజ్జితల్లి సాంగ్ కూడా దేవిశ్రీ కి ఫుల్ బజ్ తెచ్చిపెట్టింది.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా తమన్, దేవిశ్రీ కి ఆ స్టార్ డమ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ భీమ్స్ కూడా ఈ సంవత్సరం అలా తన మ్యూజిక్ తో మోత మోగిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం చేసిన సినిమాలతో పాటు రాబోతున్న సినిమాలకు సంబంధించి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో విపరీతంగా వైరల్ అవుతున్నారు భీమ్స్ . స్పెషల్లీ వెంకటేశ్ హీరోగా సంక్రాంతికొస్తున్నాం సినిమాతో పాటు మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాల నుంచి వచ్చిన సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Top Directors of 2024 : 2024లో భారీ సక్సెస్ అందుకున్న ద‌ర్శ‌కులు వీళ్లే..

తమిళ్ మ్యూజిక్ డైరెక్టరైనా తెలుగులోసక్సెస్ ఫుల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు అనిరుధ్. స్పెషల్లీ రజనీకాంత్ సినిమాలతో పాటు తెలుగులో దేవర మూవీ చేసి ఫియర్ మూవీ, సుట్టమల్లే సాంగ్, దావూదీ సాంగ్ తో ఇండియా వైడ్ ఆడియన్స్ ని అదరగొట్టేశారు. దాంతో అనిరుధ్ కూడా ఈ సంవత్సరం సక్సెస్ ఫుల్ గానే కంటిన్యూ చేశాడు. అంతేకాదు కూలీ నుంచి రిలీజైన మ్యూజిక్ తో నెక్ట్స్ ఇయర్ కూడా అదరగొట్టడం గ్యారంటీ అంటున్నారు మ్యూజిక్ లవర్స్.