Top Directors of 2024 : 2024లో భారీ సక్సెస్ అందుకున్న దర్శకులు వీళ్లే..
హీరో హీరోయిన్లకే కాదు ఈసంవత్సరం చాలా మంది డైరెక్టర్లకి సక్సెస్ ఫుల్ ఇయర్ అయ్యింది

These are the directors who got huge success in 2024
హీరో హీరోయిన్లకే కాదు ఈసంవత్సరం చాలా మంది డైరెక్టర్లకి సక్సెస్ ఫుల్ ఇయర్ అయ్యింది. చాలా కాలం నుంచి ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు బ్రేక్ ఇచ్చింది ఈ 2024. చాలా మంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇచ్చింది ఈ సంవత్సరం. మరి అలా ఈ ఇయర్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన డైరెక్టర్లెవరో చూద్దాం..
ఈ సంవత్సరం డైరెక్టర్లలో సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కంటిన్యూ చేసింది సుకుమార్. పుష్ప2 తో బన్నీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అయితే ఈ సక్సెస్ కి కారణం.. అసలు ఆ సినిమాలో ఎలివేషన్స్ కి కారణం డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాతో ఇప్పటి వరకూ మంచి కథకుడే అయిన సుకుమార్. కమర్షియల్ బ్లాక్ బస్టర్లు కూడా ఇవ్వగలడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
అంతేకాదు.. బాలీవుడ్ లో కూడా ఇంతవరకూ ఎవరికీ లేని క్రేజీ రికార్డ్ ని సొంతం చేసుకున్న పుష్ప 2 సక్సెస్ కి మూలం అయ్యారు సుకుమార్. పర్ ఫెక్షన్ కోసం ఎంత టైమ్ అయినా తీసుకునే సుకుమార్ ..తను అనుకున్న కథని యాజ్ ఇట్ ఈజ్ గా డెలివర్ చెయ్యడం కోసం ఎంత కష్టమైనా పడడం వల్లనే పుష్ప 2 బ్లాక్ బస్టర్ కి కారణమయ్యారు.
బాహుబలి లాంటి సినిమా బెంచ్ మార్క్ ని రీచ్ అవ్వాలని ట్రై చెయ్యడం అంత ఈజీకాదు. అందులోనూ రాజమౌళి లాంటి డైరెక్టర్లని బీట్ చెయ్యగలిగే నెక్ట్స్ లెవల్ కంటెంట్ ని, నెక్ట్స్ లెవల్ వరల్డ్ ని క్రియేట్ చెయ్యడం, ఆడియన్స్ ని కన్విన్స్ చెయ్యడం అంటే దానికి చాలా హోమ్ వర్క్, కమిట్ మెంట్ ఉండాలి. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ గా నాగాశ్విన్ కల్కి సినిమతో ప్రూవ్ చేసుకున్నారు.
Laila : విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ నుంచి ‘సోను మోడల్’ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిన స్టెప్పులు..
కల్కి తో ప్రభాస్ కి మరో హిట్ ఇవ్వడమే కాదు .. డైరెక్టర్ గా నెక్ట్స్ లెవల్ క్రేజ్ తెచ్చుకుని టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఈసంవత్సరాన్ని సక్సెస్ ఫుల్ గా లీడ్ చేశారునాగాశ్విన్ . అంతేకాదు.. కల్కి 2 లో ఇంకేం చూపిస్తారో అన్ని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
ఆల్రెడీ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు, టాప్ హీరోలు రిలీజ్ బరిలో ఉన్నారు. అందులోనూ సంక్రాంతి సీజన్ లో . అలాంటి పరిస్తితుల్లో వేరే ఏ డైరెక్టర్ అయినా ..ఎందుకొచ్చిన రిస్క్ అని పక్కకు తప్పుకుంటారు. కానీ ప్రశాంత్ వర్మ అలా వెనకడుగువెయ్యలేదు . కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో చిన్నసినిమా అయినా కూడా సంక్రాంతి బరిలోకి ధైర్యంగా దిగారు. ఇక్కడ హీరోగా తేజయాక్టింగ్ ఓవరాల్ పర్ ఫామెన్స్ కంటే .. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ కే క్రెడిట్ ఎక్కువ దక్కుతుంది. అంతలా క్రియేటివ్ కంటెంట్ ని , తక్కువ బడ్జెట్ లో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో చూపించి 300కోట్ల భారీ సక్సెస్ ఇచ్చి.. ఈసంవత్సరం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు జై హనుమాన్ మరిన్ని అంచనాలు పెంచుతున్నారు.
Malladi venkata krishnamurthy : మల్లాది వెంకట కృష్ణమూర్తి మెచ్చిన ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’
వెంకీ అట్లూరి ఇంతకుముందే సార్ మూవీ తో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. అయితే సెలక్ట్ చేసకున్న హీరోని బట్టి కథను కూడా మార్చాల్సి ఉంటుంది. అయితే వెంకీ మాత్రం తనసినిమాలో కథనే హీరోగా చేసి ఆడియన్స్ కి చూపించారు. కముర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథకే ఇంపార్టెన్స్ ఇచ్చి చేసిన లక్కీ భాస్కర్ .. వెంకీ కి కూడా లక్ తెచ్చిపెట్టి.. 100కోట్లసక్సెస్ అందించింది. దాంతో లాస్ట్ ఇయర్ తో పాటు ఈసంవత్సరం కూడా వెంకీ అట్లూరి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు.
సినిమాలు కమర్షియల్ గా హిట్ అయినా చాలా మంది డైరెక్టర్లు సక్సెస్ అవ్వలేదు. కానీ కొన్ని సినమాలు యావరేజ్ అయినా కూడా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ సంవత్సరంలో. అలాంటి డైరెక్టర్లెవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్.
వరసగా ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరంతో సినిమాచేసి హిట్ కొడదామన్న రిస్కీ డెసిషన్ ఏ కొత్త డైరెక్టరూ తీసుకోడు. కానీ అలాంటి రిస్కీ పని చేసిసక్సెస్ కొట్టారు డైరెక్లరు సుజిత్, సందీప్. కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన క సినిమా ఈసంవత్సరం ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఒకటి. తమ ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ల చేత కూడా అప్లాజ్ అందుకుని సక్సెస్ అయ్యారు సుజిత్ -సందీప్ .
పెద్ద సినిమాలకు సీక్వెల్స్ తీస్తున్నా..అవి అంతంతమాత్రం వర్కవుట్ అవుతున్నాయి. అలాంటిది ..5 ఏళ్లక్రితం తీసిన మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ చేసి సక్సెస్ కొట్టారు రితేశ్ రానా. కీరవాణి కొడుకు సింహ హీరోగా తెరకెక్కిన మత్తు వదలరా 2 థియేటర్లో హిలేరియస్ రెస్పాన్స్ అందుకోవడమేకాదు డైరెక్టర్ గా రితేశ్ కి ఎక్కువమార్కులే వేశారు టాలీవుడ్ జనాలు.
కొత్త డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ..కనీసం అంతో ఇంతో తెలిసిన స్టార్ కాస్ట్ ని పెట్టుకుంటారు. యదువంశీ మాత్రం తనతో పాటు కమిటీకుర్రోళ్లు సినిమాతో దాదాపు స్టార్ కాస్ట్ అందర్నీ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇంట్రస్టింగ్ స్టోరీ ని ఆడియన్స్ ని నచ్చేలా ఎమోషనల్ గా తెరకెక్కించిన కమిటీకుర్రోళ్లు ..ఈ సంవత్సరం కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఆడియన్స్ ఓటేశారంటే .. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో, డైరెక్టర్ గా యదువంశీ ఫస్ట్ మూవీతోనే ఎంత సక్సెస్ అయ్యాడో అర్దమౌతోంది.
ఓం భీమ్ బుష్ లాంటి క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎ:టర్ టైన్ చెయ్యడం అంత ఈజీకాదు. స్టోరీ జనానికి అర్దమైందా ఓకే . ఏమాత్రం కన్ ఫ్యూజ్ అయినా .. సినిమా ఫ్లాప్ అవుతుంది. అలాంటి స్టోరీ ని చాలాగ్రిప్పింగ్ గా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు యంగ్ డైరెక్టర్ హర్ష. హుషారు తో మంచి సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ .. అంతే కాన్ఫిడెంట్ గా ఓంభీమ్ బుష్ చేసి ఈ సంవత్సరం సక్సెస్ కొట్టాడు.