Muzigal Academy start at hyderabad on hands of Parthasarathy Sri Krishna
Muzigal Academy : భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ అయిన ముజిగల్ తమ నాల్గవ అత్యాధునిక సంగీత అకాడమీని హైదరాబాద్‌లోని కొత్తపేటలో ప్రారంభించింది. ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి సమక్షంలో గాయకులు పార్ధసారధి (Parthasarathy), శ్రీకృష్ణ విష్ణుబొట్ల (Sri Krishna) ఈ అకాడమీని ప్రారంభించారు. కొత్తపేట (హైదరాబాద్)లో ఉన్న అకాడమీ అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి వస్తుంది. ఇది గాత్రం మరియు వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది.
Manchu Manoj : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ కలయికలో మంచు మనోజ్ పెళ్లి సాంగ్..
దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన కొత్తపేటలోని ఈ మ్యూజిక్ అకాడమీలో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, కర్నాటిక్ వోకల్స్, హిందుస్తానీ వోకల్స్ , వెస్ట్రన్ వోకల్స్ లో బోధన చేస్తారు. ఈ మ్యూజిక్ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి నెలరోజులూ ఉచితంగా సంగీత విద్యను చేరిన ప్రతి ఒక్కరికీ అందిస్తారు. ఆ తరువాత చేరిన ప్రతి ఒక్కరికీ ఒక నెల పూర్తి ఉచిత సంగీత విద్యను అందించనున్నారు.
Inaya Sultana : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. నటరత్నాలు!
ఇక ఈ సెంటర్ లో సంగీత పరికరాలను సైతం విక్రయాలకు అందుబాటులో ఉంచారు. సంగీత అభ్యాసకుల అవసరాలను తీర్చడానికి ముజిగల్ ఆఫ్‌లైన్ తో పాటు ఆన్‌లైన్ లో కూడా క్లాస్ లు ఇవ్వనుంది. ముజిగల్, అంతర్జాతీయంగా సంగీతాభిమానులైన అంటే వారు హాబీగా సంగీతం నేర్చుకుంటున్నా లేదా ట్రినిటీ గ్రేడ్ సర్టిఫికేషన్ కోసం తీవ్రంగా శ్రమించే వారైనా, విద్యార్థుల కోరికలను తీరుస్తుంది. భారతదేశంతో పాటుగా యుఎస్‌ఏ, యుకె, ఆస్ట్రేలియా, యుఏఈలలో 10వేల మంది విద్యార్ధులకు 400కు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్లు మద్దతు అందిస్తున్నారు. ఇప్పటికే 40వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి.
Muzigal Academy start at hyderabad on hands of Parthasarathy Sri Krishna
Muzigal Academy start at hyderabad on hands of Parthasarathy Sri Krishna