LSD Web Series Review : LSD సిరీస్ రివ్యూ.. థ్రిల్లింగ్ ట్రిప్‌తో..

LSD సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఫిబ్రవరి 2న MX ప్లేయర్ ఓటీటీలో రిలీజయింది.

MX Player Bold Content LSD Web Series Review

LSD Web Series Review : అనిల్ మోదుగ, శివ కోన నిర్మాణంలో శివ కోన దర్శకుడిగా తెరకెక్కిన వెబ్ సిరీస్ LSD (లవ్, సెక్స్ అండ్ డెత్). ప్రాచీ థాకేర్, నేహా దేస్పాండె, ప్రభాకర్, కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సిరీస్ కామెడీ, బోల్డ్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కింది. ఈ LSD సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఫిబ్రవరి 2న MX ప్లేయర్ ఓటీటీలో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఓ రెండు పెళ్లి అయిన జంటలు, వారి మధ్య ప్రేమ, గొడవలతో సాగుతుంది. ఇంకో జంట త్వరలో పెళ్లి చేసుకోబోతారు. వీరంతా కలిసి ఓ అడవికి ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేస్తారు. వీళ్ళు ట్రిప్ కి వెళ్లేముందు అక్కడ వాళ్ళకి ప్రాణాపాయం ఉన్నట్టు ఓ పాపకి కల వస్తుంది. ఆ పాప ఈ జంటలకు చెప్పినా వినిపించుకోకుండా వెళ్తారు. హ్యాపీగా అడవికి మొదలయిన వారి ప్రయాణం అనుకోని మలుపులు తిరుగుతుంది. వారిలో ఒక్కొక్కరిగా ఇద్దరు చనిపోతారు. అసలు ఆ అడవిలో ఏం జరుగుతుంది? ఆ ఇద్దరు ఎలా చనిపోయారు? మిగిలిన నలుగురు ఏం అయ్యారు? ఆ పాపకి కల ఎందుకు వచ్చింది? అసలు ట్రిప్ కి ఎందుకు వెళ్లారు? ఆ జంటల మధ్య ఉన్న సమస్యలేంటి అనేది తెలియాలంటే ఓటీటీలో చూసేయాల్సిందే.

సిరీస్ విశ్లేషణ.. మొదటి ఎపిసోడ్లో ఓ పాప వింతగా ప్రవర్తించడం, క్యారెక్టర్ల పరిచయాలతో మాములుగా సాగుతుంది. రెండో ఎపిసోడ్ నుంచి ట్రిప్ కి వెళ్లడం దగ్గర్నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలుగుతుంది. ప్రతి ఎపిసోడ్ చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ అయితే ఏర్పరిచారు. ఆరుగురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ సిరీస్, ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం ఉండి.. ఎక్కువగా వారి చుట్టే కథ తిరుగుతుంది. కాకపోతే ఇటీవల సిరీస్ లలో అడల్ట్ సీన్స్, వల్గర్ పదాలు కొన్ని ఉన్నట్టే ఈ సిరీస్ లో కూడా అవి కనిపిస్తాయి. కాబట్టి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడలేము.

Also Read : Bootcut Balaraju : ‘బూట్‌కట్‌ బాలరాజు’ రివ్యూ.. అసలు ఈ బూట్ కట్ కథేంటి?

సాంకేతిక అంశాలు.. పవన్ గుంటుకు సినిమావిజువల్స్ బాగుంటాయి. ప్రవీణ్ మణి మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కొన్ని చోట్ల సాగదీసిన సీన్స్ ని ఇంకొంచెం ఎడిట్ చేయాల్సింది. కొంతమంది ట్రిప్ కి వెళ్లి ఆపదలో పడే కథాంశంతో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి కథని సిరీస్ కి తగ్గట్టు కథనం మార్చుకున్నారు దర్శకుడు శివకోన. సిరీస్ కి ఖర్చు కూడా బాగానే పెట్టారు.

నటీనటులు.. క్యాండీ పాత్రలో ప్రాచీ థాకర్, రాజు గారి పాత్రలో ప్రభాకర్ పాత్రల్లో నటించి మెప్పించారు. దర్శకుడు శివ కోన కూడా డ్యాని అనే ఓ పాత్ర పోషించారు. అభిలాష్ బండారి, కునాల్ కౌశల్, రమ్య దినేష్, నేహా దేశ్ పాండే.. మిగిలిన వాళ్ళు పర్వాలేదనిపించారు.

మొత్తంగా అక్రమ సంబంధాలు హానికరం అనే మెసెజ్ ని సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించారు ఈ LSD సిరీస్. ఫ్యామిలీతో కాకుండా ఒక్కరే చూడాలనుకుంటే ఈ సిరీస్ ని చూడొచ్చు.

గమనిక : ఈ సిరీస్ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.