మా అమ్మ హిందూ.. నాన్న క్రిస్టియన్.. పెంచింది ముస్లిం.. నా మతమేంది?: హీరోయిన్ ట్వీట్

  • Published By: vamsi ,Published On : December 21, 2019 / 04:42 AM IST
మా అమ్మ హిందూ.. నాన్న క్రిస్టియన్.. పెంచింది ముస్లిం.. నా మతమేంది?: హీరోయిన్ ట్వీట్

Updated On : December 21, 2019 / 4:42 AM IST

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లు (CAB) బిల్లుపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రోజు నుంచి ఆందోళనలు చలరేగగా.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ పలు రాష్ట్రాలు నిరసనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇదే అంశంపై ప్రముకుల నుంచి విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్‌గా ఇదే విషయంలో బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ”మా అమ్మ హిందువు. నన్ను కన్న తండ్రి క్రిస్టియన్. అలాగే నన్ను పెంచిన తండ్రి ముస్లిం. కాబట్టి అన్ని అధికారిక సర్టిఫికేట్‌లలో నా రిలీజియన్ స్టేటస్ బ్లాంక్‌గా ఉంది. అంటే నా రిలీజియన్ నేను ఇండియన్ అని తెలుపుతుందా? దీని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు.. ఆలోచించనని అనుకుంటున్నా” అంటూ దియా మీర్జా ట్వీట్ చేసింది.

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై పోరాడుతున్న విద్యార్థులు, ఇతర వర్గాలకు తన మద్దతు ప్రకటించింది దియా మీర్జా. ఈ ట్వీట్‌పై #OneIndia, #India అనే హ్యాష్ ట్యాగ్‌లను కూడా జత చేసింది ఈ భామ.