My Name Is Shruthi actress Hansika comments about Allu Arjun gone viral
Hansika : అందాల భామ హన్సిక.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈ భామ.. తమిళంలో స్టార్‌డమ్ ని అందుకుంది. ఇక ఇటీవలే పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసిన హన్సిక.. యాక్టింగ్ కెరీర్ కి మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. ఇంకా సినిమాలు చేస్తూనే ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ యాపిల్ బ్యూటీ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ అనే తెలుగు సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అయిన హన్సికను మీడియా విలేకర్లు పలు ప్రశ్నలు అడిగారు. ఈక్రమంలోనే ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ.. “దేశముదురు తరువాత మీరు అల్లు అర్జున్ మళ్ళీ కలిసి పని చేయలేదు. భవిష్యత్తులో మీ ఇద్దర్ని కలిపి ఒక స్క్రీన్ పై చూసే అవకాశం ఉందా?” అని అడిగారు.
Also read : Aadi Keshava : ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో వైష్ణవ తేజ్, శ్రీలీల సందడి..
ఇక దీనికి హన్సిక బదులిస్తూ.. “మీరు ఇదే ప్రశ్న అల్లు అర్జున్ కనిపించినప్పుడు అడగండి” అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ సినిమా విషయానికి వస్తే.. థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కింది. హన్సిక ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తుంది. శ్రీనివాస్ ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 17న విడుదలకానుంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తే.. సెకండ్ పార్ట్ కూడా తీసుకు వస్తామంటూ ప్రకటించారు. కాగా ఈ మూవీలో హన్సికకు బదులు సమంత నటించాల్సి ఉందట. కానీ సమంత వ్యక్తిగత కారణాల వల్ల ఈ మూవీ చేయలేకపోయిందని దర్శకుడు తెలియజేశాడు.