Aadi Keshava : ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో వైష్ణవ తేజ్, శ్రీలీల సందడి..

‘ఆదికేశవ’ మూవీ రిలీజ్ వాయిదా పడినా ప్రమోషన్స్ లో మాత్రం అసలు జోష్ తగ్గడం లేదు. తాజాగా ఈ చిత్ర యూనిట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో సందడి చేసింది.

Aadi Keshava : ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో వైష్ణవ తేజ్, శ్రీలీల సందడి..

Aadi Keshava team Panja Vaisshnav Tej Sreeleela at one day world cup 2023

Updated On : November 5, 2023 / 7:04 PM IST

Aadi Keshava : కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్ లో వైష్ణవ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆదికేశవ’. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నవంబర్ 10న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ కారణంగా నవంబర్ 24న వచ్చేందుకు పోస్టుపోన్ అయ్యింది. రిలీజ్ వాయిదా పడినా ప్రమోషన్స్ లో మాత్రం అసలు జోష్ తగ్గడం లేదు. తాజాగా ఈ చిత్ర యూనిట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో సందడి చేసింది.

నేడు ఇండియా, సౌత్ ఆఫ్రికా ఎండీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తెలుగు కామెంటరీ సెక్షన్ లో వైష్ణవ్ తేజ్, శ్రీలీల పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఒక మ్యాచ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సందడి చేస్తే, ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఈ మెగా హీరో వైష్ణవ్ తేజ్ సందడి చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Amala Paul : ప్రపోజల్ ఓకే చేసినంత త్వరగా.. రెండో పెళ్లి చేసేసుకున్న అమలాపాల్..

 

View this post on Instagram

 

A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka)

ఇక ఆదికేశవ సినిమా విషయానికి వస్తే.. వైష్ణవి తేజ్ తన మునపటి సినిమాలు కంటే కొంచెం మాస్ టచ్ పెంచి ఈ సినిమా చేశాడు. మరి ఈ సినిమాతో హిట్ కొట్టి మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకుంటాడా లేదా చూడాలి. ఈ మూవీ స్టోరీ అంతా ఒక గుడి, దాని దగ్గర జరిగే మైనింగ్ చుట్టూ సాగనుంది. జివి ప్రకాష్ ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా ఆ పాటలకి వైష్ణవ్ అండ్ శ్రీలీల వేసిన డాన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది.