Site icon 10TV Telugu

Mythri Movie Makers : సీరియల్స్‌లోకి సినిమా నిర్మాణ సంస్థ.. రాజశేఖర్ టైటిల్, చిరంజీవి సినిమా స్టోరీతో మొదటి సీరియల్..

Mythri Movie Makers Enters into Serials Productions with Maa Annaya Serial

Mythri Movie Makers Enters into Serials Productions with Maa Annaya Serial

Mythri Movie Makers : శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, పుష్ప.. లాంటి భారీ హిట్ సినిమాలు తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలతో భారీ సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా, సక్సెస్ గా నడుస్తుంది. ఈ స్టార్ నిర్మాణ సంస్థ ఇప్పుడు సీరియల్స్ లోకి కూడా అడుగుపెట్టింది. సీరియల్ నిర్మాణంలోకి అడుగుపెట్టి మొదటి సీరియల్ ని నిర్మిస్తుంది.

రాజశేఖర్ టైటిల్, చిరంజీవి సినిమా కథతో మైత్రీ మూవీ మేకర్స్ తమ మొదటి సీరియల్ ని తీసుకురాబోతున్నారు. ఒకప్పుడు రాజశేఖర్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ‘మా అన్నయ్య’. అదే టైటిల్ తో ఈ సీరియల్ రాబోతుంది. మా అన్నయ్య సీరియల్ జీ తెలుగులో మార్చి 25న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు మా అన్నయ్య సీరియల్ టెలికాస్ట్ కానుంది.

Also Read : Allu Arjun : మరో సరికొత్త రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్.. సౌత్ లోనే మొదటి హీరో..

గంగాధర్(గోకుల్ మీనన్)​ తండ్రి మల్లికార్జున్ (ఉదయ్) బాధ్యతారాహిత్యంగా తాగుడుకు బానిస అవడం, తల్లి సావిత్రి (రాశి) కూడా చిన్నతనంలోనే పిల్లల్ని వదిలేయడంతో చిన్నప్పట్నుంచి చెల్లెళ్ల బాధ్యత గంగాధర్ తీసుకోవాల్సి వస్తుంది. తన చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి వారి జీవితం ఆనందంగా ఉండాలని కలలు కంటాడు గంగాధర్​. దాని కోసం చాలా కష్టపడతాడు. కానీ అతని చెల్లెళ్లు వారివారి ఇష్టాలు, లక్ష్యాలకనుగుణంగా వెళ్లాలనుకుంటారు. దీంతో గంగాధర్​, అతని చెల్లెళ్లు మధ్య వచ్చే సమస్యలు, వాళ్ళ కష్టాలతో ఈ కథ సాగుతుంది. చిరంజీవి హిట్లర్ సినిమా కథకు కొంచెం దగ్గరగా ఈ కథ ఉండనుంది. ఆల్రెడీ ఈ సీరియల్ నుంచి పలు ప్రోమోలు కూడా రిలీజ్ చేసారు.

ఈ సీరియల్ గురించి ప్రకటిస్తూ మైత్రీ మూవీ మేకర్స్.. వెండితెరపైనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకూ వినోదం పంచడంలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. భావోద్వేగభరితమైన కథతో తెరకెక్కుతున్న ‘మా అన్నయ్య’ సీరియల్​ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వెండితెర లాగే బుల్లితెరపైనా ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని భావిస్తున్నాం అని తెలిపారు. సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్ టెలివిజన్ రంగంలో ఎలా మెప్పిస్తారో చూడాలి.

Exit mobile version