Naane Varuven : అన్న దర్శకత్వంలో ధనుష్ సినిమా

మూడు బ్లాక్‌బస్టర్స్ తర్వాత అన్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ మరో సినిమా చేస్తున్నారు..

Naane Varuven : అన్న దర్శకత్వంలో ధనుష్ సినిమా

Dhanush

Updated On : October 16, 2021 / 1:35 PM IST

Naane Varuven: టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ వరుస విజయాలతో, వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇటీవల ‘కర్ణన్’, ‘జగమేతంత్రం’ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్ ఇప్పుడు అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో

వి క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నానే వరువేన్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుజ కథానాయికగా నటిస్తోంది. శనివారం పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. మూవీ టీం అంతా అటెండ్ అయ్యారు.

Naane Varuven

 

‘కాదల్ కొండేన్’, ‘పుధుపెట్టై’, ‘మాయక్కమ్ ఎన్నా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత అన్నదమ్ముళ్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. సెల్వ రాఘవన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సాంకీ కాయిధమ్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. శేఖర్ కమ్ముల సినిమాతో ధనుష్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Saanki Kaayidham