Naatu Naatu : లండన్ వీధుల్లో 700 మంది ‘నాటు నాటు’ స్టెప్పు.. వీడియో చూశారా..?
RRR రిలీజ్ అయ్యి ఏడాది దాటేసింది, ఆస్కార్ గెలిచి కూడా రోజులు గడుస్తున్నాయి. కానీ నాటు నాటు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ పాటకి..
- gum 95921
- Published on- August 8, 2023 / 03:17 PM IST
Naatu Naatu song performance at london streets on the occasion of National Handloom Day
Naatu Naatu : రాజమౌళి, ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్ లో వచ్చిన RRR ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులతో పాటు ఎంతోమంది అభిమానాన్ని కూడా సంపాందించుకుంది. అంతేకాదు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ను కూడా గెలుచుకొని ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అందించిన ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ ని అందుకుంది.
Kodali Nani : చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని రియాక్షన్.. ఇండస్ట్రీలో పకోడీ గాళ్లు..
సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటేసింది, ఆస్కార్ గెలిచి కూడా రోజులు గడుస్తున్నాయి. కానీ నాటు నాటు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ పాటకి లండన్ వీధుల్లో 700 మంది డాన్స్ వేసి అదరగొట్టేశారు. ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day) సందర్భంగా మహిళలంతా చీరల్లో నాటు నాటు పాటకి కాలు కదిపారు. లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో ఈ ప్రదర్శన జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఒకసారి ఆ వీడియోలు మీరు కూడా చూసేయండి.
Fahadh Faasil : పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. భన్వర్ సింగ్ షెకావత్ అదిరిపోయే లుక్ తో..
ఇది ఇలా ఉంటే, ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ లెవెల్ వరుస అవార్డ్స్ అందుకుంటూ వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు నేషనల్ లెవెల్ లో అవార్డ్స్ ని కైవసం చేసుకునేందుకు సిద్దమవుతుంది. ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వాలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ అందుకోవడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే పలు అవార్డ్స్ నామినేషన్స్ కూడా మొదలు అయ్యాయి. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎన్ని అవార్డ్స్ అందుకున్నా.. టాలీవుడ్ ఆడియన్స్ దృష్టి అంతా ఇక్కడి అవార్డ్స్ పైనే ఉంది. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లో ఎవరెవరు ఏ అవార్డ్స్ అందుకుంటారో అని ఆసక్తిగా చూస్తున్నారు.
