Project K: ప్రభాస్ సినిమా కోసం ఆనంద్ మహీంద్రా సాయం!
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను నాగ్ అశ్విన్..
Project K: మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టిన యూనిట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది.
Project K : ప్రభాస్‌తో పని చేయడం నాకు గౌరవం.. ప్రభాస్‌పై అమితాబ్ ట్వీట్..
కాగా, ఈ ప్రాజెక్ట్ కె కోసం ఆనంద్ మహీంద్రను సహాయం కోసం అడిగాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘డియర్ ఆనంద్ మహీంద్రా సర్.. ఎన్నో విషయాల్లో మీ నుంచి ప్రేరణ పొందాను. ప్రస్తుతం నేను.. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన తారాగణంగా ‘ప్రాజెక్ట్ కె’ అనే ఒక ఇండియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మించి, ఎంతో అధునాతనమైన, విభిన్నమైన వాహనాలను ఈ సినిమా కోసం మేము రూపొందిస్తున్నాం…’
Project K: రెబల్ స్టార్‌తో అశ్విన్ సినిమా.. కీలక మార్పులు చేశారా?
‘ఒకవేళ మా కల నిజమైతే.. అది మన దేశానికే గర్వకారణంగా నిలుస్తుంది. భారతదేశంలో మునుపెన్నడూ ఇలాంటి సినిమా రాలేదు. అందుకే ఈ చిత్రాన్ని మేము ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాం. కాబట్టి, ఇంజినీర్ల విషయంలో మీ నుంచి మాకు ఏదైనా సాయం ఉంటే నేను ఎంతో సంతోషిస్తాను’ అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ఇప్పటికైతే మహీంద్రా నుండి ఎలాంటి రెస్పాన్ లేదు కానీ ఖచ్చితంగా ఆనంద్ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సహజంగా సోషల్ మీడియాలో కొత్త ఇన్వేషన్స్ ను ఎంకరేజ్ చేసే ఆనంద్ ప్రాజెక్ట్ కెకు సాయం అందించడం గ్యారంటీగా కనిపిస్తుంది.
Dear @anandmahindra sir…we are making an Indian sci-fi film with Mr.Bachan, Prabhas and Deepika called #ProjectK A few vehicles we are building for this world are unique & beyond the tech of today…if this film does wat it is supposed to, it will be the pride of our nation.
— Nag Ashwin (@nagashwin7) March 4, 2022